ఫోటో స్టోరి: ఈ కిల్ల‌ర్ లేడీ బాస్ ఎవ‌ర‌బ్బా?

అనన్య పాండే ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. `లైగ‌ర్` చిత్రంతో సౌత్‌కి ప‌రిచ‌య‌మైంది ఈ బ్యూటీ.

Update: 2024-11-11 04:17 GMT

అనన్య పాండే ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. `లైగ‌ర్` చిత్రంతో సౌత్‌కి ప‌రిచ‌య‌మైంది ఈ బ్యూటీ. న‌టుడు చంకీ పాండే న‌ట‌వార‌సురాలిగా సినీరంగ ప్ర‌వేశం చేసిన అన‌న్య త‌న‌దైన ప్ర‌తిభ‌తో వ‌రుస‌గా అవ‌కాశాల‌ను అందుకుంటోంది. మ‌రోవైపు అన‌న్య సోష‌ల్ మీడియా పోస్టులు ఇంట‌ర్నెట్ లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. తాజాగా అన‌న్య షేర్ చేసిన ఫోటోషూట్ నెటిజ‌నుల్లో చ‌ర్చ‌గా మారింది. అన‌న్య బాస్ లేడీ వైబ్స్ గురించి యూత్ విస్త్ర‌తంగా చ‌ర్చించుకుంది. వైట్ ష‌ర్ట్ - టై కాంబినేష‌న్ తో ఈ బ్యూటీ ఇస్మార్ట్ బ్లేజ‌ర్ ని ధ‌రించి డ్యాషింగ్ గా క‌నిపించింది.

ఈ ఫోటోషూట్ కి ``నా ఉద్దేశ్యం వ్యాపారం .. #ఇండియన్ స్పోర్ట్స్ హానర్స్ అవార్డులు..`` అంటూ గ‌మ్మ‌త్త‌యిన ట్యాగ్ ని జోడించింది. ఇది డ్రెస్ కోడ్ తాలూకా థీమ్ ని ఎలివేట్ చేస్తోంది. అన‌న్య స్ట‌న్నింగ్ లుక్ పై యువ‌త‌రం ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. సోష‌ల్ మీడియాల్లో ల‌వ్ హార్ట్ ఈమోజీల‌ను షేర్ చేస్తున్నారు. కిల్ల‌ర్ బాస్ లేడీ ఎవ‌ర‌బ్బా? అంటూ ఒక అభిమాని ఈ ఫోటోల‌ను సోష‌ల్ మీడియాల్లో వైర‌ల్ చేసారు. ప్ర‌స్తుతం ఈ లుక్ వెబ్ లో వైర‌ల్ గా దూసుకెళుతోంది.

అన‌న్య న‌ట‌ప్ర‌స్థానం ప‌రిశీలిస్తే... 2019లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 , పతి పత్నీ ఔర్ వోతో చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన అన‌న్య ప్రారంభ చిత్రాలు మిశ్రమ సమీక్షలను అందుకున్నా కానీ, ప్రతిభ ప‌రంగా మైమ‌రిపించింది. ఉత్తమ ఆరంగేట్ర న‌టిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకుంది. సినిమాలు ఫ్లాపైనా కానీ డ్రీమ్ గర్ల్ 2, గెహ్రైయాన్ (2022), ఖో గయే హమ్ కహాన్ (2023) చిత్రాల‌తో న‌టిగా మంచి పేరు తెచ్చుకుంది. తొలి చిత్రం స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2లో, టైగర్ ష్రాఫ్ మరియు తారా సుతారియాతో కలిసి న‌టించింది. ఆరంభం అంతంత మాత్ర‌మే అని విమర్శ‌లు ఎదురైనా కానీ, నెమ్మ‌దిగా పాత్రల ఎంపిక‌లో వైవిధ్యం క‌న‌బ‌ర‌చ‌డం ద్వారా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. 2019 రీమేక్ `పతి పత్నీ ఔర్ వో`లో అన‌న్య న‌ట‌న‌కు మంచి పేరు వ‌చ్చింది.

ఇటీవ‌ల‌ అన‌న్య‌ పాండే CTRLలో కనిపించింది. ఈ చిత్రం అభిమానులు, విమర్శకుల నుండి సానుకూల స్పందనలను పొందింది. తదుపరి అన‌న్య `కాల్ మి బే` సీజన్ 2లోను న‌టించింది. అక్షయ్ కుమార్, ఆర్.మాధవన్‌లతో ధర్మ ప్రొడక్షన్స్ సినిమాలోను అన‌న్య న‌టిస్తోంది.

Tags:    

Similar News