స్టన్నింగ్ లైగర్ బ్యూటీ కొత్త లుక్
ప్రతిసారీ పండగ సీజన్లలో మ్యాగజైన్ కవర్ షూట్లకు ప్రాధాన్యతనిచ్చే అనన్య.. మరోసారి పాపులర్ 'ఎల్లే మ్యాగజైన్' షూట్ కోసం యూనిక్ స్టైల్ డిజైనర్ దుస్తులను ఎంపిక చేసుకుంది.
ధర్మ ప్రొడక్షన్ 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'లో బాలీవుడ్ అరంగేట్రం చేసినప్పటి నుండి అనన్య పాండే సినీప్రయాణం సాఫీగా సాగుతోందనే భావించాలి. చాలా మంది ఔట్ సైడర్స్ కు ఇండస్ట్రీలో ఫ్లాప్ ఎదురైతే మరో అవకాశం రావడం కష్టం. కానీ జయాపజయాలతో సంబంధం లేకుండా అనన్య అవకాశాలు అందుకుంటోంది. నటవారసురాలు గనుక మరో కొత్త ఆఫర్ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. దర్శకనిర్మాతలు ఈ భామను వెతుక్కుంటూ వస్తున్నారు.
అయితే అనన్యకు హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా యువతరంలో భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. లైగర్ చిత్రంతో సౌతిండియాకు పరిచయమైంది గనుక ఆ మేరకు ఫాలోవర్స్ లో హైక్ ని ఆస్వాధిస్తోంది. దీనికి తోడు సోషల్ మీడియాల్లో ఎంతో యాక్టివ్ గా ఉండే అనన్య నిరంతర అప్ డేట్స్ ని అందిస్తూ నెటిజనులకు ఎంతో బాగా కనెక్టయింది.
తాజాగా ఎల్లే మ్యాగజైన్ కవర్ షూట్ తో గుబులు రేపింది. ప్రతిసారీ పండగ సీజన్లలో మ్యాగజైన్ కవర్ షూట్లకు ప్రాధాన్యతనిచ్చే అనన్య.. మరోసారి పాపులర్ 'ఎల్లే మ్యాగజైన్' షూట్ కోసం యూనిక్ స్టైల్ డిజైనర్ దుస్తులను ఎంపిక చేసుకుంది. 26 ఏళ్ల అనన్య పాండే టోన్డ్ లుక్ తో డిజైనర్ దుస్తుల్లో గుబులు పెంచుతోంది. ప్రస్తుతం ఈ స్పెషల్ ఫోటోషూట్ 25 మిలియన్ల మంది అనుచరులకు చేరువైంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. అనన్య పాండే కాల్ మీ బే2లో అత్యుత్తమ నటప్రదర్శనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత చివరిగా CTRLలో కనిపించింది. ఈ చిత్రం అభిమానులు, విమర్శకుల నుండి సానుకూల స్పందనలను పొందింది. తదుపరి అక్షయ్ కుమార్, ఆర్.మాధవన్‌లతో ధర్మ ప్రొడక్షన్స్ సినిమాలోను అనన్య నటిస్తోంది.