అనన్య పాండే.. లైగర్ టైమ్ లో అలా చేసిందా?
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది.
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది. బీ టౌన్ యాక్టర్ చుంకీ పాండే కుమార్తెగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అమ్మడు.. తక్కువ టైమ్ లోనే ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. జీరో సైజ్ బ్యూటీగా ఫేమ్ సంపాదించుకుంది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 మూవీతో ఒక్కసారి లైమ్ లైట్ లోకి వచ్చిన బ్యూటీ.. వరుస అవకాశాలు అందుకుని ఇప్పుడు దూసుకుపోతోంది. సూపర్ హిట్ చిత్రాల్లో నటిస్తోంది.
అయితే తెలుగులోకి లైగర్ మూవీతో అనన్య పాండే ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. స్టార్ హీరో విజయ్ దేవరకొండ లీడ్ రోల్ లో పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఆ సినిమా.. డిజాస్టర్ గా నిలిచింది. దీంతో విజయ్, పూరీ భారీగా విమర్శలు ఎదుర్కొన్నారు. లైగర్ తో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవుదామనుకున్న అనన్యకు కూడా నిరాశే మిగిలింది. ఆ తర్వాత ఒక్క అవకాశాన్నీ అందుకోలేకపోయింది అమ్మడు.
దీంతో బాలీవుడ్ లోనే మళ్లీ సెటిల్ అయిన అనన్య.. Call Me Bae షోలో చేసిన లేటెస్ట్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాను ఒక యంగ్ హీరోయిన్ గా .. ఇండస్ట్రీలో అవసరమైనప్పుడు కచ్చితంగా మాట్లాడుతానని తెలిపింది, ప్రస్తుత జనరేషన్ యువతీ యువకులు తమ అభిప్రాయాలను కచ్చితంగా షేర్ చేసుకోవాలని చెబుతోంది. అందుకు ఉదాహరణగా లైగర్ మూవీ టైమ్ లో జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంది.
లైగర్ స్క్రిప్ట్ ను చదువుతున్నప్పుడు.. కొన్ని డైలాగ్స్ విషయంలో ఆందోళన చెందానని అనన్య పాండే తెలిపింది. వాటిని చెప్పడానికి అసౌకర్యంగా అనిపించిందని పేర్కొంది. Gen- Z వ్యక్తులు ఇలా మాట్లాడరు కదా అని చాలా అనిపించినట్లు వెల్లడించింది. స్క్రిప్ట్ లోని కొన్ని డైలాగ్స్ ను తప్పుపట్టడం ఒక మహిళగా తన కర్తవ్యంగా అనిపించినట్లు పేర్కొంది. తాను చెప్పిన ఛేంజెస్ కు మేకర్స్ కూడా ఒప్పుకున్నట్లు అనన్య తెలిపింది.
దీంతో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు సంతోషంగా అనిపించిందని వెల్లడించింది. మహిళల భద్రత కోసం మాట్లాడటం చాలా ముఖ్యమని ఎప్పుడూ భావిస్తానని చెప్పింది. అవసరం అయినప్పుడు.. వీలు అయినప్పుడు కచ్చితంగా తన వాయిస్ ను వినిపిస్తానని తెలిపింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ తెగ చక్కర్లు కొడుతుండగా.. డైలాగ్స్ విషయంలో ఆమె తీసుకున్న చొరవను కొందరు ప్రశంసిస్తున్నారు. లైగర్ టైమ్ లో.. ఓహో అలా జరిగిందా అని అంటున్నారు.