స్టార్ హీరో కొడుకు క్యూటీని బెదిరించాడట
తన్మయ్ భట్‌తో సినిమా గురించి మాట్లాడుతూ అనన్య చాలా త్రోబ్యాక్ విషయాలను రివీల్ చేసింది.
బాలీవుడ్ లో స్టార్ డాటర్స్ నటీమణులుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే వీళ్లలో కొందరు స్టార్లుగా వెలిగిపోతున్నారు. అలాంటి వారిలో నటుడు చంకీ పాండే వారసురాలు అనన్య పాండే ముందు వరుసలో ఉంటుంది. అనన్య స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 చిత్రంతో వెండితెరకు పరిచయమై కెరీర్ పరంగా చాలా దూరం ప్రయాణించింది. పూరి దర్శకత్వంలో లైగర్ చిత్రంలోను నటించిన సంగతి తెలిసిందే.
అయితే ఈ బ్యూటీ హీరో ఆదిత్య రాయ్ కపూర్ తో డేటింగ్ చేయడం, ఇటీవల బ్రేకప్ అవ్వడంతో కొన్నాళ్లుగా హెడ్ లైన్స్ లో నిలిచింది. ఇప్పుడు అనన్య తన బాల్యంలోని స్మృతులను అభిమానుల కోసం షేర్ చేస్తోంది. ఇందులో తనను ఒక స్టార్ హీరో కుమారుడు బెదిరించేవాడని కూడా తెలిపింది. ఇది ఫన్ కోసమా? లేదా నిజమైన బెదిరింపా? అన్నది తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాలి.
నెట్‌ఫ్లిక్స్ ఇండియా షేర్ చేసిన ఓ వీడియోలో అనన్య పాండే కనిపించింది. దీనిలో CTRL డైరెక్టర్ విక్రమాదిత్య మోత్వానే హాస్యనటుడు తన్మయ్ భట్‌తో సినిమా గురించి మాట్లాడుతూ అనన్య చాలా త్రోబ్యాక్ విషయాలను రివీల్ చేసింది. ఇంటరాక్షన్ సమయంలో అనన్య కొన్ని ఫన్నీ విషయాలను వెల్లడించింది.
''నేను ఒక రోజులో ఏమి చేస్తున్నానో ఒక రోజులో ఏం తింటానో అవన్నీ ఫోన్ లో రికార్డ్ చేసేదానిని. కానీ ఆ వీడియోలను ఎక్కడా పోస్ట్ చేయను. నా దగ్గర ఆ ఫుటేజ్ ఉంది! ఫోటోబూత్ ఆపిల్‌లో ఇప్పుడే వచ్చింది. నేను, సుహానా, షానయా చాలా విషయాలను రికార్డ్ చేసేవాళ్లం. కానీ మాకు పని చేయకపోతే ఆ వీడియోలను లీక్ చేస్తానని ఆర్యన్ (షారూఖ్ కుమారుడు) మమ్మల్ని బెదిరించేవాడు'' అని అనన్య తెలిపింది.
అనన్యకు షారూఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ , సంజయ్ కపూర్ కుమార్తె షానయా కపూర్ చిన్నప్పటి నుండి స్నేహితులు. ఆర్యన్ సుహానా అన్నయ్య. అందువల్ల అనన్యకు ఆర్యన్ క్లోజ్. ఇప్పుడు అనన్య త్రోబ్యాక్ విషయాలను చెబుతూ నాటి ఫన్ ని ఆస్వాధించినట్టు వెల్లడించింది. ఇదంతా బాల్యంలోని సరదా విషయలు అని, దానిని తన 'రాండమ్ ట్రామా స్టోరీ' అని కూడా అనన్య వ్యాఖ్యానించింది. దానికి తన్మయ్ భట్ 'ఎవరైనా ఆర్యన్‌తో మాట్లాడాలి' అని చమత్కరించాడు. ఇన్ స్టా బాలీవుడ్ ఈ విషయాలను తన సోషల్ మీడియాల్లో రివీల్ చేసింది. దీనికి అభిమానుల నుంచి అద్భుతమైన స్పందనలు వస్తున్నాయి.