రిలేషన్‌షిప్ ఎలా ఉండాలో చెప్పిన నటి!
''నేను నా భాగస్వామి ఆసక్తులకు అనుగుణంగా ఉంటాను.. వారితో సరితూగేలా నా ప్రాధాన్యతలను కూడా మార్చుకుంటాను.
అనన్య పాండే డేటింగ్ లైఫ్ గురించి తెలిసిందే. బోయ్ ఫ్రెండ్ ఆదిత్యారాయ్ కపూర్ నుంచి విడిపోయిన ఈ బ్యూటీ మాజీ విదేశీ మోడల్ వాకర్ బ్లాంకోతో డేటింగ్ చేస్తోందని పుకార్లు వస్తున్నాయి. అనంత్ అంబానీ పెళ్లిలో ఈ జోడీ మొదటిసారి కలిసారు. ఆ తర్వాత ఇద్దరి మధ్యా ఏదో జరుగుతోందన్న పుకార్లు మొదలయ్యాయి. అయితే ఈ పుకార్లను ఈరోజు వరకూ అనన్య ఖండించనూ లేదు.. అలాగని ధృవీకరించనూ లేదు. బ్లాంకో ప్రస్తుతం అంబానీల వంటారాలో ఉద్యోగి.
రకరకాల పుకార్ల నడుమ అనన్య సంబంధాలలో స్వీయ గౌరవం, వ్యక్తిత్వంపై మాట్లాడింది. రిలేషన్‌షిప్‌లో స్పేస్‌ను కలిగి ఉండటం ఆరోగ్యకరమని తాను నమ్ముతున్నానని... ఇద్దరి మధ్య ప్రేమ పెరగడానికి అప్పుడప్పుడు దూరం కలిసొస్తుందని నమ్ముతానని కూడా అనన్య తెలిపింది. ఇద్దరు వ్యక్తులు రిలేషన్ షిప్‌లో ఉన్నప్పుడు కూడా తమ వ్యక్తిత్వాన్ని, భావాన్ని కాపాడుకోవడం చాలా అవసరమని అనన్య అంది. వ్యక్తిగత జీవితంలో సమతుల్యత ప్రాముఖ్యతను అనన్య నొక్కి చెప్పింది.
అనన్య గతంలో తన భాగస్వామి ప్రాధాన్యతలకు అనుగుణంగా తనను తాను మార్చుకునేదానిని అని, కొన్నిసార్లు తన సొంత గుర్తింపును కోల్పోయానని కూడా ఒప్పుకుంది. ''నేను నా భాగస్వామి ఆసక్తులకు అనుగుణంగా ఉంటాను.. వారితో సరితూగేలా నా ప్రాధాన్యతలను కూడా మార్చుకుంటాను. నేను నా స్నేహితులతో తక్కువ సమయం గడిపాను. వారు అడగకుండానే నా జీవితంలో మార్పులు చేసుకున్నాను'' అని తెలిపింది. అయితే సంబంధంలో ఉన్నప్పుడు వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడం నేర్చుకుందిట. నేను కేవలం సంబంధాన్ని కొనసాగించడమే కాదు.. దీర్ఘకాలంలో అది ఎప్పటికీ పనిచేయదని నమ్ముతున్నాను. స్వీయ-భరోసా అవసరమని కూడా భావిస్తోందట. భాగస్వామ్యంలోనైనా ఆమె భావోద్వేగ స్వాతంత్య్రం, పరస్పర గౌరవాన్ని కలిగి ఉండటం అవసరమని భావిస్తున్నట్టు తెలిపింది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే... అనన్య వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. ప్రస్తుతం ప్రైమ్ వీడియో కోసం కాల్ మీ బే రెండవ సీజన్‌ను చిత్రీకరణలో పాల్గొంటోంది. చాంద్ మేరా దిల్ అనే చిత్రంలో నటిస్తోంది. సి.శంకరన్ నాయర్ బయోపిక్ లోను నటిస్తోంది. అక్షయ్ కుమార్, మ్యాడీలతో కలిసి ఈ బయోపిక్ లో నటించనుంది.