ఆకాశంలో అనన్య అలా.. ట్రెండ్ సెట్ చేసిందిగా!

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే.

Update: 2024-10-18 11:02 GMT

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. మల్లేశం మూవీతో హీరోయిన్ గా తెలుగు సినీ ప్రియులకు పరిచయమైన ముద్దుగుమ్మ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీలా సాబ్ ప్రాజెక్ట్ తో ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నారు. ఆ సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించారు. ఆ తర్వాత నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సందడి చేస్తున్నారు. త్వరలో పొట్టేల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

పొట్టేల్ లో చంద్రకృష్ణ, అనన్య జంటగా నటిస్తున్నారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సినిమాను సాహిత్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న మూవీ.. అక్టోబర్ 25వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండుడంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు మేకర్స్. ఏ చిన్న అవకాశం వదులుకోకుండా అన్నింటినీ యూజ్ చేసుకుంటున్నారు. సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నారు.

తాజాగా అనన్య.. విమానంలో ప్రమోషన్స్ చేశారు. తన ప్రయాణించిన ఫ్లైట్ లో పొట్టేల్ మూవీని ప్రమోట్ చేశారు. నోయల్, చంద్ర కృష్ణతో కలిసి అనన్య.. తన తోటి ప్రయాణికులకు పోస్టర్లు అందజేశారు. అందుకు సంబంధించిన వీడియోను... తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆడ చేస్తాం ఈడ చేస్తాం యాడైనా చేస్తాం అంటూ క్యాప్షన్ చేశారు. ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారిన అనన్య ప్రమోషన్స్ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

అనన్య పోస్ట్ చేసిన వీడియోను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యామని పలువురు నెటిజన్లు చెబుతున్నారు. ఫ్లైట్ లో కూడా ఇలా చేస్తారా అని క్వశ్చన్ చేస్తున్నారు. అనన్య ట్రెండ్ సెట్ చేశారని చెబుతున్నారు. ప్రమోషన్స్ కు కాదేదీ అనర్హం అని సరదాగా కామెంట్లు పెడుతున్నారు. బాక్సాఫీస్ వద్ద పొట్టేల్ తో అనన్య మంచి హిట్ అందుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. క్రేజీ మూవీ ప్రమోషన్స్ అంటూ క్యాప్షన్ ఇచ్చి వీడియో షేర్ చేస్తున్నారు.

పొట్టేల్ మూవీని ఎన్ ఐ ఎస్ ఏ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌ పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రగ్యా సన్నిధి క్రియేషన్స్ బ్యానర్‌ పై సురేష్ కుమార్ సడిగే సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనన్య, చంద్ర కృష్ణ, నోయల్ తో పాటు అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరీ, నీల్ సీన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. మరి ఈ మూవీ ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.

Tags:    

Similar News