నిజంగా తన్నినా అంతా యాక్టింగ్ అనేవారు!
తెలిసిన పరిశ్రమ సహా పరిచయాలు కూడా ఎక్కువగా ఉండటంతో స్టార్ కిడ్ కి కొన్నాళ్ల పాటు అవకాశాల పరంగా ఢోకాలేదు.
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్యా పాండే బాలీవుడ్ లో బిజీ అయ్యే ప్రయత్నాల్లో ఉన్న సంగతి తెలిసిందే. `లైగర్` తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చినా అమ్మడు ఒక్క ప్లాప్ కే ముంబైలో వాలిపోయింది. టాలీవు డ్ వద్దు..బాలీవుడ్ ముద్దు అంటూ అక్కడే సినిమాలు చేసుకుంటుంది. ఇంకా అక్కడ నిలదొ క్కుకునే ప్రయత్నాల్లో ఉంది. తెలిసిన పరిశ్రమ సహా పరిచయాలు కూడా ఎక్కువగా ఉండటంతో స్టార్ కిడ్ కి కొన్నాళ్ల పాటు అవకాశాల పరంగా ఢోకాలేదు.
గ్రేట్ పెర్పార్మర్ అనుకుంటనే నెత్తిన పెట్టుకునే దర్శక-నిర్మాతలెంతో మంది. తాజాగా అమ్మడు ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ కి వచ్చేందుకు ప్రేరేపించిన అంశాలతో పాటు, మరికొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది. చిన్నప్పటి నుంచి నాకు నటన అంటే ఇష్టం. నా తల్లిదండ్రుల దృష్టి నాపై ఉండేదుకు మా అన్నయ్య , చెల్లితో తరుచూ గొడవ పడేదాన్ని. వాళ్లను కొట్టే దాన్ని..తిట్టేదాన్ని. కానీ మా అమ్మ నాన్న ఆమెది అంతా నటన అని ఎగతాళి చేసేవారు.
నిజంగా కోపం వచ్చి కొట్టినా వాళ్లు అలాగే అనుకునేవారు. ఆ నటనే నన్ను బాలీవుడ్ వైపు అడుగులు వేసేలా చేసింది. ఒకరిలా నటిండడమన్నా..ఆసక్తికర కథలు చెప్పమన్నా చాలా ఇంట్రెస్ట్ గా చెబుతా. 'హ్యారీ పోటర్' లాంటి జీవితం ఒక్క రోజైనా గడపాలని ఉంటుంది. ఆ సినిమా ఇప్పటికీ లెక్కలేనన్ని సార్లు చూసాను. నాకు బాగా నచ్చిన చిత్రాల్లో అది ముందుంటుంది. 'హాలోవీన్' సినిమా కూడా ఇష్టం.
ఆ సినిమా విడుదల తేదీని..నేను పుట్టిన తేదీకి దగ్గర సంబంధం ఉంది. సినిమా అక్టోబర్ 31న రిలీజ్ అయితే నేను ఆ ముందు రోజు అక్టోబర్ 30న పుట్టాను' అని తెలిపింది. త్వరలో అమ్మడు 'కాలీ మీ బే' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ అమ్మడు 'లైగర్' సినిమాతో తెలుగు పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.