దీపావళికి ముందే ఇల్లు కొన్న 'లైగర్' బ్యూటీ
దీని తర్వాత అనన్య గృహప్రవేశ పూజ ఆచారాలలో భాగంగా ఇంటి గుమ్మం వద్ద కొబ్బరికాయ కొడుతున్నప్పటి క్లిప్ ని షేర్ చేసింది.
లైగర్ బ్యూటీ అనన్య పాండే ధన్‌తేరాస్ 2023 సందర్భంగా తన కొత్త చిరునామాను వెల్లడించింది. తన కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్టు వెల్లడించింది. ఈ ఇంట్లో ధన్ తేరాస్ శుభసందర్భాన పూజ నిర్వహించింది. ఇప్పుడు కొత్త ఇంటి నుంచి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాల్లో షేర్ చేసింది. ''నా సొంత ఇల్లు! మీ ప్రేమ.. మంచి వైబ్స్ కావాలి! కొత్త ఆరంభాలకు .. ధంతేరాస్ శుభాకాంక్షలు'' అని వ్యాఖ్యానించింది.
అనన్య దీపావళికి ముందే ఇల్లు కొనుక్కుందని దీనిని బట్టి క్లారిటీ వచ్చింది. అనన్య షేర్ చేసిన ఈ ఫోటోల్లో మొదటి ఫోటోలో పసుపు రంగు దుస్తులు ధరించి చేతులు ముడుచుకుని పోజులిచ్చింది. తన కొత్త ఇంట్లో జరిగిన పూజల సందర్భంగా తీసిన ఫోటో ఇది. దీని తర్వాత అనన్య గృహప్రవేశ పూజ ఆచారాలలో భాగంగా ఇంటి గుమ్మం వద్ద కొబ్బరికాయ కొడుతున్నప్పటి క్లిప్ ని షేర్ చేసింది.
ప్రముఖులు శుభాకాంక్షలు :
అనన్య పోస్ట్‌పై స్పందిస్తూ టైగర్ ష్రాఫ్ వ్యాఖ్య “వావ్ అనన్యకు అభినందనలు" అని రాశారు. “కంగ్రాట్స్ మై డార్లింగ్ అనన్య. మీకు మరింత శక్తి” అని శిల్పాశెట్టి అన్నారు. ఫరా ఖాన్ ఇలా వ్యాఖ్యానించింది, "వావ్! అది ఎవరు అంటే అనన్య.. ఈ ఇల్లు మీకు అపారమైన అదృష్టాన్ని ఆనందాన్ని అందించాలని కోరుకుంటున్నాను''అని విష్ చేసింది.
అనన్య తల్లి భావన పాండే కూడా ఇలా రాశారు, ''నీ గురించి చాలా గర్వంగా ఉంది.” నిత్య తేజస్సుతో ప్రకాశించు'' అని వ్యాఖ్యానించింది. మాళవిక మోహనన్, గౌహర్ ఖాన్, అమృత అరోరా, షానయ కపూర్, సన్యా మల్హోత్రా, మహీప్ కపూర్ కూడా అనన్యకు శుభాకాంక్షలు తెలిపారు.
అనన్య చంకీ పాండే -భావన పాండేల కుమార్తె. ఇటీవల కరణ్ జోహార్ కాఫీ విత్ కరణ్ 8లో కనిపించి వార్తల్లో నిలిచింది. సారాఖాన్ తో కలిసి తన లవ్ లైఫ్ గురించి ఓపెనైంది. అనన్య తన డేటింగ్ పుకార్లపై కూడా క్లుప్తంగా వ్యాఖ్యానించింది. ఆదిత్య రాయ్ కపూర్‌తో డేటింగ్ చేస్తున్నట్లు అంగీకరించింది. నిజానికి ఇటీవల అనన్య - ఆదిత్య ముంబైలోని తన ఇంట్లో సారా అలీ ఖాన్ హోస్ట్ చేసిన దీపావళి పార్టీకి హాజరయ్యారు.
అనన్య చివరిసారిగా డ్రీమ్ గర్ల్ 2లో ఆయుష్మాన్ ఖురానా సరసన నటించింది. తర్వాత సిద్ధాంత్ చతుర్వేది- ఆదర్శ్ గౌరవ్లతో కలిసి 'ఖో గయే హమ్ కహాన్'లో కనిపించనుంది. 'కాల్ మీ బే' అనే వెబ్ సిరీస్ లోను నటించనుంది. తదుపరి మరో రెండు సినిమాలకు సంతకాలు చేసింది. వాటి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.