చీరలో లైగర్ పిల్ల హొయలు.. హీటెక్కించే షో

అయితే, చీర చాలా ట్రాన్సపరెంట్ గా ఉండటంతో ఆమె నడుము అందాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఈ చీరలో అనన్య మరీ సన్నగా కనపడుతోంది.

Update: 2023-08-11 17:04 GMT

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తున్న బ్యూటీ అనన్య పాండే. అక్కడ వరస అవకాశాలు వస్తున్నా, స్టార్ హీరోయిన్ రేంజ్ కి మాత్రం ఎదగలేకపోయింది. అయితే, టాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంది. విజయ్ దేవరకొండ పాన్ ఇండియా మూవీ లైగర్ తో దక్షిణాదిన కూడా సత్తా చాటాలని అనుకుంది. కానీ, ఆ మూవీ కాస్త బెడిసి కొట్టడంతో బ్యూటీ ఆశలన్నీ నిరాశలైపోయాయి.


అనన్య పాండే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. గ్యాప్ ఇవ్వకుండా తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. క్లీవేజ్ సొగసులతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. ఎప్పుడూ పొట్టి దుస్తుల్లో మెరిసే ఈ బ్యూటీ ఈ సారి చీర కట్టింది. పసుపు రంగు చీరలో మెరిసింది. పసుపు రంగు చీరకు అదే కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ తో పెయిర్ చేసింది.


ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ పెట్టుకొని సింపుల్ గా లుక్ కంప్లీట్ చేసింది. అయితే, చీర చాలా ట్రాన్సపరెంట్ గా ఉండటంతో ఆమె నడుము అందాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఈ చీరలో అనన్య మరీ సన్నగా కనపడుతోంది. మాములూగానే అనన్యది జోరీ సైజ్. ఈ మధ్య మరీ చిక్కినట్లు ఉంది. అయితే, చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్లు, ఇలా కూడా అందంగానే ఉంది.


ఈ ఫోటోల సంగతి పక్కన పెడితే, అనన్య రీసెంట్ ప్రేమలో పడింది. ఆమె ప్రేమించింది కూడా బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్ కావడం విశేషం. వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించిందో తెలీదు కానీ, ఎక్కడకు వెళ్లినా ఇద్దరూ కలిసే వెళుతున్నారు. ఈఫ్రేమ పక్షులు ఈ మధ్య చాలా సార్లు మీడియా కంట పడ్డారు. వాళ్లు కలిసి వెళ్లకపోయినా, కలిసి తిరగడం మాత్రం మీడియా కంట పడింది.

వీరు పోర్చుగల్ ట్రిప్ కి వెళ్లిన సమయంలో ఆదిత్య రాయ్ , అనన్య పాండే ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకొని ఉన్న ఫోటోలు బయటకు రావడం విశేషం. వీరిద్దరి అభిమానులు ఈ ఫొటోలను చూసి వాటిని క్లిక్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.ఇకపోతే ఈ జంట ఇప్పుడు బాలీవుడ్ లో వైరల్ గా మారగా వీరిద్దరికి దాదాపు 13 ఏళ్ల వయసు తేడా ఉంది అంటూ కూడా కొన్ని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News