అనసూయ: వాటికి ఎవరు అడ్డు చెప్పకూడదు!

యాంకర్ గా కెరియర్ స్టార్ట్ చేసి స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న అనసూయ ఇప్పుడు టాలీవుడ్ నటిగా తనదైన గుర్తింపుతో దూసుకుపోతోంది

Update: 2024-08-05 05:45 GMT

యాంకర్ గా కెరియర్ స్టార్ట్ చేసి స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న అనసూయ ఇప్పుడు టాలీవుడ్ నటిగా తనదైన గుర్తింపుతో దూసుకుపోతోంది. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో క్యామియో రోల్ చేసిన అనసూయ క్షణం సినిమాలో నెగిటివ్ పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది. ఆ తరువాత రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రతో అనసూయ బాగా గుర్తింపు సొంతం చేసుకుంది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు.

వరుస సినిమాలు చేస్తూ నటిగా దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు, నాలుగు సినిమాల వరకు ఉన్నాయి. సింబ అనే మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. పుష్ప ది రూల్ చిత్రంలో పవర్ ఫుల్ క్యారెక్టర్ లో అనసూయ మరోసారి కనిపించబోతోంది. ఇదిలా ఉంటే అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఇన్ స్టాగ్రామ్ లో తన ఫోటోలని షేర్ చేస్తుంది. అలాగే తన ఫ్యామిలీ వెకేషన్స్ పిక్స్ కూడా పంచుకుంటుంది.

ఆమె మీద సోషల్ మీడియాలో కొన్ని కాంట్రవర్సీలు కూడా నడిచాయి. అయితే ఎవరైనా విమర్శిస్తే వారికి అనసూయ సీరియస్ గా కౌంటర్ ఇస్తుంది. తన ఆలోచనలని, అభిప్రాయాలని ఎవరు విమర్శించిన యాక్సప్ట్ చేయదు. విమర్శించేవారిని వదిలేస్తే అదే పని కొనసాగిస్తారని అనసూయ భావిస్తుంది. అందుకే సోషల్ మీడియాలో ఎవరైన తన వ్యక్తిత్వంపై దాడి చేస్తే తిరిగి స్ట్రాంగ్ గా వారికి సమాధానం చెబుతూ ఉంటుంది.

ఈ పద్ధతి ఎవరికి నచ్చిన నచ్చకపోయిన అది వారి సమస్య… నేను చెప్పాలనుకున్నది చెబుతానని ధైర్యంగా అనసూయ మాట్లాడుతుంది. ఇంటర్వ్యూలలో కూడా ఇలాగే తన అభిప్రాయాలని అనసూయ పంచుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన డ్రెస్సింగ్ పై అనసూయ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నా డ్రెస్సింగ్ పై బయట వారు మాత్రమే కాకుండా ఇంట్లో నా కొడుకు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తాడు. నడుము పైకి టాప్ వేసుకుంటే నా కొడుక్కి నచ్చదని అనసూయ చెప్పింది.

అయితే నాకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా డ్రెస్సింగ్ వేసుకుంటానని, దానిపై అభ్యంతరాలు పెట్టకూడదని నా కొడుక్కి నేను చెబుతాను. అలాగే నా పిల్లల డ్రెస్సింగ్ విషయంలో కూడా నేను ఎలాంటి అభ్యంతరం తెలియజేయను. షాపింగ్ మాల్ కి వెళ్లిన వారికి నచ్చిన డ్రెస్ తీసుకోమని చెబుతాను. ఆ స్వేచ్ఛని నేను వారికిచ్చాను. స్వేచ్ఛగా నచ్చిన నిర్ణయం తీసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. వాటికి ఎవరు అడ్డు చెప్పకూడదు అని అనసూయ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Tags:    

Similar News