ఒకటి చెబితే అది జనాల్లోకి మరోలా! అనసూయ
తాజాగా ఈ ప్రచారాలన్నింటిని అనసూయ ఖండించింది. తాను తుమ్మినా..దగ్గినా కాంట్రవర్శీ చేస్తున్నారంటూ అసహనాన్ని వ్యక్తం చేసింది
యాంకర్ కం నటి అనసూయ ఇటీవలే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అదేశిస్తే పార్టీ తరుపున ప్రచారం చేస్తానని ప్రకటించినట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఆ పార్టీలో చేరి పవన్ కళ్యాణ్ కి తోడుగా ఉంటుందని మీడియాలో కథనాలు వైరల్ అయ్యాయి. రేపోమాపో పార్టీలే చేరిపోతుందని ప్రచారం సాగింది. ఈ ప్రచారంపై రకరకాల విశ్లేషణలు సైతం తెరపైకి వచ్చాయి. ఇంతకాలం జనసేన ఊసులేని అమ్మడు ఇప్పుడే పనిగట్టుకుని పార్టీ ప్రచారం ఏంటి? దీని వెనుక ఏదైనా ఎత్తుగడ ఉందా? అని కొన్ని ఊహాగానాలు నెట్టింట తెరపైకి వచ్చాయి.
తాజాగా ఈ ప్రచారాలన్నింటిని అనసూయ ఖండించింది. తాను తుమ్మినా..దగ్గినా కాంట్రవర్శీ చేస్తున్నారంటూ అసహనాన్ని వ్యక్తం చేసింది. ఓ ఇంటర్వ్యూలో రాజకీయ ప్రవేశం గురించి ఇలా స్పందించింది. 'నాయకుడు నచ్చి..అతడి ఎజెండా నచ్చితే తప్పకుండా ప్రోత్సహిస్తానని చెప్పా. అంతే కానీ పార్టీలో చేరతానని గానీ ప్రచారం చేస్తానని గాని చెప్పలేదు. జనసేన పార్టీ అజెండా నాకెంతో నచ్చింది' అని తెలిపింది. ఆ కారణంగానే జనసేన పార్టీకి అనసూయ తన మద్దతు ప్రకటించినట్లు క్లారిటీ వచ్చింది.
అయితే పార్టీలో చేరకుండా పార్టీని ఏ రకంగా ప్రోత్సహిస్తుందో ? కూడా వివరణ ఇవ్వాలని అడుగుతున్నారు. పార్టీ అజెండా నచ్చినప్పుడు పార్టీ తరుపున క్యాపెనింగ్ చేసినప్పుడే ఆ పార్టీకి తన మద్దతు ఇచ్చినట్లు ఉంటుందని నెటి జనులు అభిప్రాయపడుతున్నారు. అంతేగానీ అజెండా నచ్చిందని..పార్టీని ప్రోత్సహి స్తానని ఓమాట అనేసి ఊరుకుంటే? ఆ పార్టీ ఎలా గెలుస్తుంది? మీ లాంటి వాళ్లు వెనుకుండో లేదా ముందుండో? నడిపిస్తే పార్టీ కోసం పనిచేసినట్లు ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో ఆ దిశగా అమ్మడు అడుగులు వేస్తుందా? నోటి మాటతోనే సరిపెడుతుందా? అన్నది చూడాలి.
ఇటీవలే అనసూయ నటించిన 'రజాకార్' రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకి విమర్శకుల నుంచి ప్రశంలొచ్చినా ప్లాప్ అయింది. ప్రేక్షకులకు ఆ సినిమా రీచ్ అవ్వేలేదు. భారీ ఎత్తున పాన్ ఇండియా లో రిలీజ్ చేసినా పనవ్వలేదు. ప్రస్తుతం అనసూయ మరో పాన్ ఇండియా చిత్రం 'పుష్ప-2' లో నటిస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.