చీరలో అనసూయ.. గ్లామర్ తో స్టన్ అయ్యేలా..
అనసూయ.. స్మాల్ స్క్రీన్ పై యాంకర్ గా వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు నటిగా విలక్షణ పాత్రల్లో నటిస్తోంది

అనసూయ.. స్మాల్ స్క్రీన్ పై యాంకర్ గా వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు నటిగా విలక్షణ పాత్రల్లో నటిస్తోంది. వెండితెరపై నటనతో అందరినీ మెప్పిస్తోంది. నటిగా ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో పర్సనల్ అప్డేట్లతో కెరీర్ కు సంబంధించిన అప్డేట్లు షేర్ చేస్తోంది. కొత్త కొత్త ఫొటోలు షేర్ చేస్తూ తన ఫాలోవర్స్ ను పెంచుకుంటోంది.

సినిమాల్లో నటిస్తూనే.. పలు ఈవెంట్స్ కు అటెండ్ అవుతోంది. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కు వెళ్తూ సందడి చేస్తుంటుంది. అందుకు సంబంధించిన పిక్స్ షేర్ చేస్తుంటుంది. వాటితోపాటు మోడ్రన్ అండ్ శారీ ఫొటో షూట్స్ షేర్ చేస్తూ వావ్ అనిపిస్తుంది. అయితే అనసూయ చీర ధరిస్తే ఆ అందమే వేరని నెటిజన్లు అంటున్నారు. తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని పిక్స్ వైరల్ గా మరాయి.

క్రీమ్ కలర్ చీర, డార్క్ బ్లూ కలర్ బ్లౌజ్ లో దిగిన ఫొటోలను షేర్ చేసింది అనసూయ. ఒక్క ఫొటోలో ఒక్కో విధంగా స్టిల్ ఇచ్చింది. రకరకాల హావభావాలు ఇచ్చింది. అదిరిపోయే బ్లాక్ గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి పోస్ట్ చేసింది. "గుర్తుంచుకోండి.. మీరు చేసే పనిని, మీలా మరెవరూ చేయలేరు.. అది మీ సూపర్ పవర్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. కొంటెగా నవ్వుతూ అందరినీ అట్రాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఆమె పోస్ట్ కు లైకులు, కామెంట్లు భారీగా వచ్చిపడుతున్నాయి.
క్యారెక్టర్ రోల్స్, విలన్ పాత్రలు చేస్తూ అనసూయ ఫుల్ బిజీగా ఉంది. గత ఏడాది తెలుగులో అనసూయ నటించిన ఐదు సినిమాలు రిలీజయ్యాయి. మైఖేల్, రంగమార్తాండ, విమానం, పెదకాపు, ప్రేమ విమానం సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ చేసింది. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న పుష్ప 2లో నెగెటివ్ షేడ్ రోల్‌లో కనిపించబోతోంది అనసూయ. దాక్షయణిగా ఫస్ట్ పార్ట్ కు మించి సీక్వెల్‌లో ఆమె విలనిజం ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
మరోవైపు, ఫ్లాష్‌బ్యాక్ అనే మూవీతో ఈ ఏడాది అనసూయ కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ప్రభుదేవా హీరోగా నటిస్తున్న ఈ మూవీ త్వరలో రిలీజ్ కానుంది. ఫ్లాష్‌బ్యాక్ తో పాటు మరికొన్ని తమిళ సినిమాలకు అనసూయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మలయాళంలో మమ్ముట్టి హీరోగా నటించిన భీష్మపర్వంలో అనసూయ కీలక పాత్ర పోషించింది. అలా అనసూయ.. చేతినిండా మూవీలతో బిజీగా ఉంది.