గుక్కపట్టి ఏడ్చేసిన అనసూయ.. రీజనేంటి?
ఎప్పుడూ సరదాగా నవ్వుతూ, తన అందాలతో కవ్విస్తూ కనిపించే అనసూయ, తన సోషల్ మీడియాలో గుక్కపట్టి ఏడుస్తున్న వీడియో ఒకటి షేర్ చేసింది.
అనసూయ అంటే అందం, చలాకీతనం, ఎప్పుడూ ముఖంపై చిరు నవ్వు, ఎదుటివారు ఎంతవారైనా తనదాకా వస్తే ఇచ్చి పడేసే మనస్తత్వం. సమాజంలో తనకు నచ్చినవీ, నచ్చనివీ అన్నీ నిర్మోహమాటంగా చెప్పే వ్యక్తిత్వం ఇదే మనకు తెలుసు. కానీ, తనకు కూడా ఒక మనసు ఉంటుందని, విపరీతంగా ట్రోల్స్ చేస్తే తన మనసుకు కూడా బాధ కలుగుతుందని చాలా మంది ఆలోచించి ఉండరు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ సెలబ్రెటీలను ట్రోల్ చేయడం ఫ్యాషన్ గా పెట్టుకున్నారు.
అలా ట్రోల్స్ బారిన పడినవారిలో అనసూయ కూడా ఒకరు. ఎవరు ఎంత మంది ఎన్ని సార్లు ఇబ్బంది పెట్టినా, భరిస్తూ ధీటుగా సమాధానాలు చెబుతూ వచ్చిన ఈ సారి మాత్రం తట్టుకోలేకపోయింది. తన బాధ మొత్తాన్ని కన్నీటి రూపంలో తెలియజేసింది.
ఎప్పుడూ సరదాగా నవ్వుతూ, తన అందాలతో కవ్విస్తూ కనిపించే అనసూయ, తన సోషల్ మీడియాలో గుక్కపట్టి ఏడుస్తున్న వీడియో ఒకటి షేర్ చేసింది. అది చూసి మొదట అందరూ షాకయ్యారు. తర్వాత ఆమె ఎందుకు ఏడుస్తుందో తెలియజేస్తూ, ఆమె పెట్టిన క్యాప్షన్ చూసిన తర్వాత కానీ అసలు విషయం అర్థం కాలేదు. ఇంతకీ ఆ పోస్టులో అనసూయ ఏం పెట్టిందో ఓసారి చూద్దాం..
అందరికీ హలో, మీరందరూ బాగానే ఉన్నారని అనుకుంటున్నాను. అంటూ మొదలుపెట్టి, సోషల్ మీడియాను ఎందుకు వాడటం మొదలుపెట్టామో కూడా ఆమె తెలియజేశారు. సోషల్ మీడియాను మొదట్లో సమాచారం కోసం, కమ్యూనికేషన్ వాడటం మొదలుపెట్టామని, ప్రపంచంలోని వివిధ విషయాలు తెలుసుకోవడం మొదలుపెట్టామని ఆమె అన్నారు. కానీ, ఇప్పుడు సోషల్ మీడియాను అలా వాడటం లేదని, మన నాలెడ్జ్ పెంచుకోవడానికి వాడటం లేదు అని ఆమె చెప్పారు.
ఇక, తాను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు, నవ్వులు, కౌంటర్లు అన్నీ తన జీవితంలో భాగమేనని ఆమె చెప్పారు. కానీ తాను బాధపడిన సందర్భాలు, ఏడ్చిన సందర్భాలను మాత్రం షేర్ చేసుకోలేదన్నారు.ఓ సెలబ్రెటీగా తాను తన అభిప్రాయాలు చెబుతూ ఉంటానని, తనపై చాలా సార్లు ట్రోలింగ్ జరిగినా, కొద్దిరోజులు బాధపడి, మళ్లీ నవ్వుతూ బయటకు వస్తూ ఉంటానని ఆమె చెప్పారు. తనను తాను రీఛార్జ్ చేసుకుంటానని, అంతేకానీ, సమస్యల నుంచి పారిపోను అని చెప్పారు.
అందరితో దయతో ఉండాలని, ఎదుటివారు మనకు హాని చేసినా, వారిపై జాలి చూపించాలని, ఏదో ఒకరోజు వాళ్లే మన కోసం వస్తారు అని ఆమె అన్నారు.ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని, ఐదురోజుల క్రితం బాధగా అనిపించినప్పుడు ఇలా ఏడ్చిన వీడియో రికార్డు చేసి పెట్టుకున్నట్లు ఆమె చెప్పారు. అయితే, ఆమె అలా ఏడ్వడానికి ట్రోలింగ్, సోషల్ మీడియాలో నెగిటివిటీ కారణం అని తెలుస్తోంది. ఏది ఏమైనా ఇలా ఏడ్చేసి అనసూయ అందరినీ కంగారుపెట్టిందనే చెప్పాలి.