హేట‌ర్స్ పై అన‌సూయ శ‌మ‌ర‌శంఖం!

యాంక‌ర్ క‌మ్ న‌టి అన‌సూయ ఓవైపు ఎమోష‌న‌ల్ అవుతూనే త‌న‌దైన శైలిలో సీరియ‌స్ నెస్ ప్ర‌ద‌ర్శిస్తుంది.

Update: 2023-08-20 12:27 GMT

యాంక‌ర్ క‌మ్ న‌టి అన‌సూయ ఓవైపు ఎమోష‌న‌ల్ అవుతూనే త‌న‌దైన శైలిలో సీరియ‌స్ నెస్ ప్ర‌ద‌ర్శిస్తుంది. ఆమె ఏడ్చిన వీడియో నెట్టింట ఎలా వైర‌ల్ అయిందో తెలిసిందే. దానిపై కామెంట్లు...వాటికి అన‌సూయ కౌంట‌ర్ల సంగ‌తి విధిత‌మే. తాజాగా అమ్మ‌డు హేట‌ర్స్ ని ఉద్దేశిస్తూ ఆస‌క్తిక పోస్ట్ పెట్టింది. ` మిమ్మ‌ల్ని చూస్తుంటే బాధ‌గా ఉంది. ఎదుట వ్య‌క్తుల‌ను త‌క్కువ చేసి వాళ్లు బాధ‌ప‌డుతుంటే సానుభూతి చూపించి మీకు మీరు మంచి వ్య‌క్తులుగా ఫీల‌వుతున్నారు. ఆ బాధ‌ప‌డిన వ్య‌క్తి బ‌లంగా నిల‌బ‌డితే మాత్రం తీవ్రమైన వ్యాఖ్య‌లు చేసారు.

ఇదే క‌దా క‌ప‌ట ధోర‌ణి అంటే. ఎంతో మందికి ఉదాహ‌ర‌ణ‌గా ఉండేలా జీవితంలో ఎదిగా. ప్ర‌స్తుతం ఉన్న ప్ర‌పంచంలో స‌మ‌స్య‌లు ఎదురైతే పారిపోకుండా ఎలా ముందుకెళ్లాలో చూపిస్తా. ఎందుకంటే నువ్వు ఒక స్థాయికి వెళ్లే వ‌ర‌కూ వాళ్లు కింద‌కి లాగాల‌నే చూస్తారు. నువ్వు చ‌నిపోయాక సానుభూతి చూపించి అటెన్ష‌న్ పొందాల‌నుకుంటారు. బ‌తికినంత కాలం చావాల‌నిపించేలా ట్రీట్ చేసి ..చ‌చ్చాక ఉద్ద‌రించాల‌నుకుంటారు.

ఇంత‌కు ముందే విప‌రీత‌మైన ద్వేషాన్ని ఎదుర్కుని నిల‌బ‌డ్డా. ఇక ముందూ నిల‌బ‌డ‌తా. హేట‌ర్స్ ని ఎప్పుడు నిరాశ‌ప‌రుస్తూనే ఉంటా. నన్ను అభిమానించే వాళ్ల‌ని ఎప్ప‌టిలాగే ఆరాదిస్తాను. మీరు నా బ‌లం ..శ‌క్తి అంటూ అన‌సూయ పోస్ట్ చేసింది. మ‌రో ట్వీట్ లో ఐయామ్ స్వారీ.. ట్విట‌ర్..ఇన్ స్టా గ్రామ్ ..సోష‌ల్ మీడియాలో ఉంటానికి కార‌ణం ఏంటి? అటెన్ష‌న్ పొంద‌డం కోసం కాదా? అని ప్ర‌శ్నించారు.

ఇన్ని విమ‌ర్శ‌లు..వివాదాలు ఎదుర్కోవ‌డం దేనికి..సోష‌ల్ మీడియాకి దూరంగా ఉంటే ఈ లొల్లి అంతా ఉండ‌దు క‌దా? అన్న ప్ర‌శ్న రెయిజ్ కాకుండానే అనసూయ ముందే ఆ ర‌కంగా స‌మాధానం ఇచ్చేసింది. సోష‌ల్ మీడియాలో ఓ సెక్ష‌న్ నుంచి అన‌సూయ ఎప్పుడూ వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కుంటూనే ఉన్న సంగ‌తి తెలిసిందే. అయినా స‌రే ఏ మాత్రం బెద‌ర‌కుండా విమ‌ర్శ‌ల్ని తిప్పికొడుతూ త‌న‌దైన శైలిలో ముందు కెళ్తుంది.

Tags:    

Similar News