ఎట్టకేలకు వివాదాస్పద స్టార్ కపుల్ విడాకులు
సెలబ్రిటీ ప్రపంచంలో అత్యంత వివాదాస్పద విడాకుల కేసుగా ఏంజెలీనా జోలీ - బ్రాడ్ పిట్ నడుమ వివాదం నిరంతరం వార్తా కథనాల్లో నిలిచింది.
సెలబ్రిటీ ప్రపంచంలో అత్యంత వివాదాస్పద విడాకుల కేసుగా ఏంజెలీనా జోలీ - బ్రాడ్ పిట్ నడుమ వివాదం నిరంతరం వార్తా కథనాల్లో నిలిచింది. ఈ జంట దాదాపు ఎనిమిదేళ్ల కోర్టు పోరాటం అనంతరం విడాకుల పరిష్కార దశకు చేరుకున్నారు. ఆ మేరకు పీపుల్ మ్యాగజైన్ తో జోలీ న్యాయవాది వివరాల్ని పంచుకున్నారు. బ్రాంజెలీనా జంట ఒక ఒప్పందానికి వచ్చారని ఆయన తెలిపారు. తద్వారా హాలీవుడ్ చరిత్రలో సుదీర్ఘమైన వివాదాస్పదమైన విడాకులలో ఒకదానిని ముగిస్తున్నామని అన్నారు. జోలీ న్యాయవాది జేమ్స్ సైమన్ అసోసియేటెడ్ ప్రెస్‌కి ఈ విషయాన్ని ధృవీకరించారు.
ఎనిమిదేళ్ల క్రితం ఏంజెలీనా మిస్టర్ బ్రాడ్ పిట్ నుండి విడాకుల కోసం దాఖలు చేసింది. పిల్లలు తమ ఆస్తులన్నింటినీ జోలీ విడిచిపెట్టారని, అప్పటి నుంచి కుటుంబంలో శాంతి కోసం ప్రయత్నిస్తున్నారని జోలీ న్యాయవాది వ్యాఖ్యానించారు. అయితే ఈ ముగింపునకు సంబంధించిన పత్రాలేవీ ఇంకా అందలేదని సమాచారం.
49ఏళ్ల జోలీ, 61 ఏళ్ల బ్రాడ్ పిట్ 12 సంవత్సరాల బంధం ఇక ముగిసిపోనుంది. వారికి 23 ఏళ్ల మాడాక్స్, 21 ఏళ్ల పాక్స్, 19 ఏళ్ల జహారా, 18 ఏళ్ల షిలోహ్ , 16 ఏళ్ల వయసున్న ఆరుగురు పిల్లలను పోషించారు. వీరిలో కవలలు నాక్స్, వివియన్నే ఉన్నారు. 2016లో ఓ విమాన ప్రయానంలో తనతో, తన పిల్లలతో బ్రాడ్ అనుచితంగా ప్రవర్తించాడని జోలీ విడాకుల కోసం దాఖలు చేసింది. అప్పటి నుంచి కోర్టుల పరిధిలో పోరాటం సాగుతోంది. అయితే పిల్లలతో ఆస్తుల విభజన ప్రక్రియ అంత సులువు కాదు. దీనికోసం చాలా కాలంగా ప్రాసెస్ సాగుతోంది. పిల్లల కస్టడీని విడిగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఒప్పందానికి సంబంధించిన వివరాలేవీ ఇంకా వెల్లడి కాలేదు. తాజా ప్రకటనతో దీనిపై ఒక క్లారిటీ రానుంది.
ఏంజెలినా, బ్రాడ్ పిట్ హాలీవుడ్ లో ప్రముఖ తారలు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. వందల కోట్ల పారితోషికాలు అందుకున్న ఈ తారల కుటుంబ జీవితం అస్తవ్యస్థంగా మారడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.