చిరు తర్వాత నాగార్జునే గురి..!
ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం సినిమా చేస్తున్నాడు అనీల్ రావిపుడి. ఈ సినిమా ను కూడా వెంకీ మామ ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చేలా చేస్తున్నాడు.
టాలీవుడ్ లో తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అందుకున్న దర్శకుడిగా రాజమౌళి పేరు చెబుతాం. ఐతే ఆయన తర్వాత ఆ స్థానాన్ని దక్కించుకున్నాడు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనీల్ రావిపుడి. ఆయన సినిమా వస్తుంది అంటే చాలు ఆడియన్స్ అంతా కూడా థియేటర్స్ కు క్యూ కడుతుంటారు. ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకుడిగా అనీల్ రావిపుడి తన ముద్ర వేసుకున్నాడు. పటాస్ తో మొదలైన ఈ దర్శకుడి సినిమా ప్రస్థానం చివరిగా వచ్చిన భగవంత్ కేసరి సినిమా వరకు వరుస హిట్లతో దూసుకెళ్తుంది.
ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం సినిమా చేస్తున్నాడు అనీల్ రావిపుడి. ఈ సినిమా ను కూడా వెంకీ మామ ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చేలా చేస్తున్నాడు. ఐతే ఈ సినిమా తర్వాత అనీల్ రావిపుడి మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తాడని తెలుస్తుంది. అనీల్ రావిపుడి, చిరంజీవి ఈ కాంబో సినిమా వస్తే మెగా ఫ్యాన్స్ కి పండగ అన్నట్టే లెక్క. ఓ పక్క చిరు మార్క్ మాస్ ఎలిమెంట్స్ తో అనీల్ మార్క్ ఎంటర్టైనింగ్ తో సినిమా అదిరిపోతుంది.
ప్రస్తుతం విశ్వంభర షూట్ లో ఉన్న చిరు ఆ సినిమా పూర్తి చేశాక అనీల్ సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఐతే చిరు తర్వాత తన టార్గెట్ కింగ్ నాగార్జున పెట్టినట్టు ఉన్నాడు అనీల్ రావిపుడి. ఇప్పటికే బాలయ్య, వెంకటేష్ లతో సినిమాలు చేసిన అతను ఇప్పుడు చిరుతో కూడా సినిమాకు రెడీ అయ్యాడు. చిరు సినిమా కూడా పూర్తైతే నెక్స్ట్ నాగార్జునతోనే చేసేందుకు రెడీ అవుతాడు.
అసలైతే నాగ్ తో అనీల్ సినిమా అంతకుముందు డిస్కషన్స్ లో వచ్చింది. మరి ఏమైందో ఏమో కానీ ఆ సినిమా వర్క్ అవుట్ కాలేదు. ఐతే చిరు తర్వాత కచ్చితంగా నాగార్జున కూడా అనీల్ తో సినిమాకు ఆసక్తి చూపించే ఛాన్స్ ఉంది. నా సామిరంగ సినిమా తర్వాత నాగార్జున సోలోగా ఏ సినిమా కమిట్ అవ్వలేదు. ప్రస్తుతం రజినితో కూలీ, ధనుష్ తో కుబేర చేస్తున్నాడు నాగార్జున.
కథల విషయంలో నాగార్జున స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఐతే తనకు నచ్చిన కథ దొరక్క కాస్త టైం తీసుకుంటున్నాడు. నాగార్జున సినిమా అప్డేట్స్ కోసం అక్కినేని ఫ్యాన్స్ అంతా కూడా ఈగర్ గా ఉన్నారు.