భూల్ భూలయ్యా 3.. పుష్ప రాజ్ క్రేజ్ ని వాడేస్తున్నారుగా..

నార్త్ ఇండియాలో ‘పుష్ప 2’ పైన విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ సినిమా కోసం నార్త్ ఇండియన్ లో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Update: 2024-10-26 11:30 GMT

నార్త్ ఇండియాలో ‘పుష్ప 2’ పైన విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ సినిమా కోసం నార్త్ ఇండియన్ లో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా నార్త్ లో రూరల్ ఏరియాలలో ‘పుష్ప 2’ పట్ల ప్రేక్షకులు ఎక్కువ ఇంటరెస్ట్ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి డిస్టిబ్యూటర్ అనిల్ తడాని కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ పైన ఎక్కువ ఫోకస్ చేశారు. వీలైనన్ని ఎక్కువ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో ‘పుష్ప 2’ ని విడుదల చేయాలని అనుకుంటున్నారు.

ఇదిలా ఉంటే నవంబర్ 1న బాలీవుడ్ నుంచి ‘సింగం అగైన్’, ‘భూల్ భూలయ్యా 3’ రిలీజ్ అవుతున్నాయి. అయితే ఈ రెండింటిలో ‘సింగం అగైన్’ పైన ఎక్కువ క్రేజ్ ఉంది. దీనికి కారణంగా హిందీలో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ చిత్రంగా ఈ మూవీ రాబోతుండటమే. ఇందులో అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్, దీపికా పదుకునే నటించారు. వీరి పాత్రలు అన్ని కూడా సినిమాలో చాలా బలంగా ఉండబోతున్నాయి.

‘భూల్ భూలయ్యా 3’ లో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తూ ఉండగా మాధురీ దీక్షిత్, విద్యా బాలన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. అందుకే మెజారిటీ థియేటర్స్ ని ‘సింగం అగైన్’ కి కేటాయించాలని ఆ మూవీ మేకర్స్ డిమాండ్ చేస్తున్నారు. మల్టీ ప్లెక్స్ 60:40, సింగిల్ స్క్రీన్ థియేటర్స్ 75:25 రేషియోతో రెండు సినిమాలకి కేటాయించాలని అడుగుతున్నారు. ‘భూల్ భూలయ్యా 3’ మేకర్స్ మాత్రం 50:50 రేషియోలో థియేటర్స్ కావాలని అడుగుతున్నారు.

అయితే ఎగ్జిబిటర్లు ‘సింగం అగైన్’ సినిమా పైన ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారంట. ఈ నేపథ్యంలో ‘భూల్ భూలయ్యా’ 3 డిస్టిబ్యూటర్ అనిల్ తడాని సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లుకి ఒక ఆఫర్ ఇచ్చారంట. ‘భూల్ భూలయ్యా 3’ సినిమాకి ఎవరైతే థియేటర్స్ ఇస్తారో అక్కడ ‘పుష్ప 2’ మూవీకి సంబంధించి 30 అడుగులు అల్లు అర్జున్ కటౌట్ ని ఉచితంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు.

‘పుష్ప 2’ పైన బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న నేపథ్యంలో డిస్టిబ్యూటర్ అనిల్ తడాని ఆఫర్ పై ఆసక్తి చూపిస్తున్నారంట. ‘భూల్ భూలయ్యా 3’ ని ప్రదర్శిస్తే ‘పుష్ప 2’ మూవీని కూడా ప్రదర్శించే అవకాశం వస్తుందని థియేటర్ ఓనర్స్ భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందుకే ‘భూల్ భూలయ్యా 3’ సినిమాని తమ థియేటర్స్ లో విడుదల చేయడానికి ఓనర్స్ ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి హిందీ సినిమాలని ప్రమోట్ చేసుకోవడానికి కూడా అల్లు అర్జున్ ఇమేజ్ ఉపయోగపడుతోందని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News