యానిమల్ - ఆ ఒక్క సీన్ గురించే చర్చంతా
అందరికి తెలిసిన ఒక రెగ్యులర్ స్టొరీ లైన్ కి తనదైన ఎక్స్ ట్రీమ్ టచ్ ఇచ్చి వేరే లెవల్ లో చూపించారనే మాట వినిపిస్తోంది.
సందీప్ రెడ్డి వంగా ఎప్పటిలాగే యానిమల్ సినిమాని తనదైన స్టైల్ లో ప్రెజెంట్ చేసి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్నారు. తాజాగా థియేటర్స్ లోకి వచ్చిన మూవీ రన్ టైం మూడు గంటలకి పైగా ఉన్న ఆడియన్స్ కి ఎక్కడా బోర్ అనిపించలేదంటే అది పూర్తిగా సందీప్ రెడ్డి క్రెడిట్ అని చెప్పాలి. అందరికి తెలిసిన ఒక రెగ్యులర్ స్టొరీ లైన్ కి తనదైన ఎక్స్ ట్రీమ్ టచ్ ఇచ్చి వేరే లెవల్ లో చూపించారనే మాట వినిపిస్తోంది.
సందీప్ రెడ్డి ఇతర దర్శకులతో వేరు చేసి చూపించే ఆ పవర్ ఫుల్ ఎలిమెంట్స్ అన్ని కూడా యానిమల్ లో ఉన్నాయి. కేవలం శృతి మించిని యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులని కాస్తా భయపెట్టిన కథని చెప్పే విధానంపై ఎవ్వరూ వంకలు పెట్టడం లేదు. ముఖ్యంగా సినిమా లాస్ట్ లో పోస్ట్ క్రెడిట్స్ సీన్స్ లో అయితే ఒక సన్నివేశం గురించి ఆడియన్స్ ఎక్కువగా మాట్లాడుకున్తున్నారంట
సినిమాలో అస్సలు మిస్ కాకూడని సర్ప్రైజింగ్ ఎలిమెంట్ గా ఈ సీక్వెన్స్ ని సందీప్ రెడ్డి వంగా డిజైన్ చేశాడు. థియేటర్స్ నుంచి బయటకి వచ్చిన తర్వాత కూడా ప్రేక్షకులని వెంటాడే సన్నివేశాలలో అది ఒకటిగా ఉంటుందనే కామెంట్స్ వస్తున్నాయి. అది కూడా విక్రమ్ సినిమాలో రోలెక్స్ రేంజ్ లో ఆ క్యారెక్టర్ ను హైలెట్ చేసే ప్రయత్నం చేశారు.
భయంకరమైన రణబీర్ కు ధీటుగా మళ్ళీ మరో రణబీర్ రంగంలోకి దిగితే ఎలా ఉంటుంది అనే పాయింట్ ను సీక్వెల్ కోసం డిజైన్ చేసినట్లు అనిపిస్తుంది. ఏమాత్రం దయ మరో క్రూరమైన యానిమాల్ లాంటి క్యారెక్టర్ ను హైలెట్ చేసిన విధానం హాట్ టాపిక్ అవుతోంది. చివరలో ఆడియెన్స్ ఆ సీన్ ను చివరలో అలా చూస్తూ ఉండిపోతున్నారు. రణబీర్ యానిమాల్ క్యారెక్టర్ కు మించిన మరో వైలెంట్ రణబీర్ ఎలా ఉంటాడో యానిమాల్ పార్క్ లో చూపించబోతున్నట్లు హింట్ ఇచ్చారు.
తండ్రి కొడుకుల బంధంలో కూడా మరోకోణాన్ని యానిమల్ సినిమాలో టచ్ చేశాడు. చిన్నప్పటి నుంచి తండ్రి ప్రేమ కోరుకునేవాడికి అది దొరక్కపోతే ఎలాంటి మానసిక సంఘర్షణ అనుభవిస్తాడు. తాను ఎంతగానో ప్రేమించే తండ్రికి ఎవరైన హాని చేయాలని ప్రయత్నం చేస్తే ఎలా రియాక్ట్ అవుతాడు అనేది రణబీర్ కపూర్ పాత్ర ద్వారా చూపించరు.
ఆ మల్టీలేయర్ ఉన్న పెర్ఫార్మెన్స్ ని రణబీర్ కపూర్ కూడా అద్భుతంగా చేసి చూపించారు. అందుకే యానిమల్ సినిమా చాలా మందికి కనెక్ట్ అయ్యింది. అయితే ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కించిన సినిమా అయిన కూడా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్లి యానిమల్ సినిమాని చూడలేరనే అభిప్రాయం సినీ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.