యానిమల్ ఖాతాలో ఎవర్ గ్రీన్ రికార్డ్..!

ఇప్పటివరకు ఇండియన్ బాక్సాఫీస్ పై ఏ అడల్ట్ రేటెడ్ మూవీ 400 మార్క్ కలెక్ట్ చేయలేదు. ఈ విషయంలో యానిమల్ అరుదైన రికార్డ్ అందుకుంది.

Update: 2023-12-06 10:58 GMT

ప్రేక్షకుల ఆలోచన విధానం మారడంతో దానికి తగిన సినిమాలు రావడం వల్ల వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు. కొన్ని సినిమాలు కొందరికి మాత్రమే నచ్చుతాయి.. కానీ ఆ కొందరికి నచ్చే సినిమాలు రికార్డులు సృష్టిస్తాయి. సాధారణంగా ఒక ఫ్యామిలీ సినిమాను చిన్నా పెద్దా అంతా కలిసి చూస్తారు. దానికి ఎలాంటి ఆంక్షలు ఉండవు అలాంటి సినిమా ప్రేక్షకుల మెప్పు పొందితే వసూళ్ల బీభత్సం సృష్టిస్తాయి. కానీ ఒక అడల్ట్ సినిమా అలాంటి కలెక్షన్స్ రాబట్టాలంటే మాత్రం అది ఆడియన్స్ కి బాగా ఎక్కేసి ఉండాలి.

రీసెంట్ గా వచ్చిన రణ్ బీర్ కపూర్ యానిమల్ సినిమా అలాంటి రికార్డ్ సృష్టించింది. సెన్సార్ నుంచి A సర్టిఫికెట్ అందుకున్న ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తూ వసూళ్ల విషయంలో అదరగొడుతుంది. సినిమా రిలీజైన 4 రోజుల్లోనే 425 కోట్ల కలెక్ట్ చేసింది అంటే ఆ సినిమా రేంజ్ ఏంటన్నది అర్ధం చేసుకోవచ్చు.

ఇప్పటివరకు ఇండియన్ బాక్సాఫీస్ పై ఏ అడల్ట్ రేటెడ్ మూవీ 400 మార్క్ కలెక్ట్ చేయలేదు. ఈ విషయంలో యానిమల్ అరుదైన రికార్డ్ అందుకుంది. ఇదివరకు సందీప్ వంగ డైరెక్ట్ చేసిన కబీర్ సింగ్ కూడా 370 కోట్ల దాకా రాబట్టింది. అది కూడా A రేటెడ్ మూవీనే. కాని యానిమల్ ఆ రికార్డ్ కూడ బ్రేక్ చేసి 400 కోట్ల పైన వసూళ్లతో దూసుకెళ్తుంది.

బాలీవుడ్ తో పాటు తెలుగులో కూడా యానిమల్ కలెక్షన్స్ బాగున్నాయి. హిందీ డబ్బింగ్ సినిమాల్లో యానిమల్ తెలుగులో రికార్డ్ వసూళ్లు రాబడుతుంది. ఇక సినిమా ఫుల్ రన్ లో 800 నుంచి 1000 కోట్ల దాకా రాబట్టే అవకాశం ఉందని చెప్పొచ్చు. యానిమల్ సినిమా ఓవర్సీస్ లో కూడా భారీగానే కలక్షన్స్ సాధిస్తుంది. సందీప్ వంగ రణ్ బీర్ కపూర్ ఇద్దరు కలిసి బాక్సాఫీస్ పై విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. రణ్ బీర్ కెరీర్ లో యానిమల్ బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని చెప్పొచ్చు. సినిమాలో రణ్ బీర్ కపూర్ నటన చూసి బాలీవుడ్ డైరెక్టర్స్ కూడా షాక్ అయ్యారని చెప్పడంలో సందేహం లేదు. క్యారెక్టర్ డ్రైవెన్ స్టోరీస్ తో సందీప్ వంగ ఇండియన్ బాక్సాఫీస్ పై తన మార్క్ చూపిస్తున్నాడు. యానిమల్ తో డైరెక్టర్ గా సందీప్ గ్రాఫ్ ఓ రేంజ్ లో పెరిగిందని చెప్పొచ్చు.

Tags:    

Similar News