యానిమల్.. బుధవారం లెక్కతో మరో రికార్డ్

2023లో 500 కోట్ల క్లబ్ లోకి చేరిన ఆరో సినిమాగా యానిమల్ నిలిచింది. బుధవారం దేశవ్యాప్తంగా ఈ మూవీ 70 కోట్ల రూపాయిలు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Update: 2023-12-07 06:15 GMT

సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా తెరకెక్కిన సినిమా యానిమల్‌. డిసెంబర్‌ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రణ్‌బీర్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలుస్తోంది. మంచి వసూళ్లను సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమా విడుదలైన ఆరో రోజుల్లోనే రూ.500 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది.

2023లో 500 కోట్ల క్లబ్ లోకి చేరిన ఆరో సినిమాగా యానిమల్ నిలిచింది. బుధవారం దేశవ్యాప్తంగా ఈ మూవీ 70 కోట్ల రూపాయిలు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ సినిమా ఇప్పటి వరకు 520 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. సెకండ్ వీకెండ్ లోనూ ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించనుందని సినీ పండితులు చెబుతున్నారు.

దీంతో ఈ సినిమా వెయ్యి కోట్ల రూపాయలను ఈజీ వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. యానిమల్ సినిమా బ్రేక్ ఈవెన్ విషయానికి వస్తే.. 200 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం 210 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మూడు రోజుల్లోనే లాభాల్లోకి ప్రవేశించింది.

ఇప్పటికే ఈ చిత్రం సుమారుగా 250 కోట్లకుపైగా లాభాలను నమోదు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తండ్రీకొడుకులు సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా రణ్ బీర్ కపూర్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. రణ్ బీర్ సరసన రష్మిక నటించగా.. త్రిప్తి డిమ్రీ తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు.

టీ సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషన్ కుమార్, మురాద్ ఖేతాని ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. మరోవైపు, ఈ సినిమా విజయం సాధించడంతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు డిమాండ్ పెరిగిందట. ఆయనతో సినిమా చేయడానికి స్టార్ హీరోలు కూడా రెడీ అవుతున్నారట. ఇప్పటికే సందీప్ ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేయడానికి ఒకే చెప్పిన విషయం తెలిసిందే. అలాగే బన్నీ సినిమా కూడా లైన్ లో ఉంది. మహేష్ బాబుతోనూ ఒక సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడు సందీప్.

Tags:    

Similar News