మ‌హేష్‌కి 'జై బాబూ' అంటూ జై కొట్టాడు

తాను 'ఒక్క‌డు' సినిమా చూసాక‌, మ‌హేష్ బాబు మెసేజ్ పెట్టాన‌ని, దానికి మ‌హేష్ నుంచి కూడా రిప్ల‌య్ వ‌చ్చింద‌ని అన్నాడు ర‌ణ‌బీర్

Update: 2023-11-27 17:48 GMT

స్టార్ల‌ను తెలుగు ప్రేక్ష‌కులు ఎంత‌గా అభిమానిస్తారో నిరూపించేందుకు ఒక వేదిక కావాల‌ని చాలా కాలంగా ఎదురు చూసాన‌ని, అందుకు ఇది స‌రైన వేదిక‌గా నిలిచింద‌ని 'యానిమల్' ప్రీరిలీజ్ వేడుక‌లో ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి అన్నారు. హైద‌రాబాద్ మ‌ల్లారెడ్డి యూనివ‌ర్శిటీలో కాలేజ్ విద్యార్థులు, స‌హా భారీ జ‌న సందోహం న‌డుమ 'యానిమ‌ల్' ప్రీరిలీజ్ ఈవెంట్ ఘ‌నంగా జ‌రిగింది. ఈ వేదిక‌పై రాజ‌మౌళి స‌హా ర‌ణ‌బీర్ క‌పూర్ అద్భుత‌మైన స్పీచ్ తో ఆక‌ట్టుకున్నారు.

తాను 'ఒక్క‌డు' సినిమా చూసాక‌, మ‌హేష్ బాబు మెసేజ్ పెట్టాన‌ని, దానికి మ‌హేష్ నుంచి కూడా రిప్ల‌య్ వ‌చ్చింద‌ని అన్నాడు ర‌ణ‌బీర్. త‌న సినిమా ప్ర‌చారానికి విచ్చేసినందుకు ధ‌న్య‌వాదాలు తెలిపాడు. జై బాబూ.. జై బాబూ.. అంటూ మ‌హేష్ కి జై కొట్టాడు ర‌ణ‌బీర్. వేదిక వ‌ద్ద మ‌హేష్ అభిమానులు ఉత్సాహ‌ప‌రిచేందుకు ర‌ణ‌బీర్ ఇలా ప్ర‌య‌త్నించాడు. ఈవెంట్ లో రణ్‌బీర్ కపూర్ మాట్లాడుతూ.. ''తెలుగు చిత్ర పరిశ్రమ నాకు ఎంతో ప్రత్యేకం. నా మొదటి సినిమాకి వచ్చినపుడు నా తొలి అటోగ్రాఫ్ హైదరాబాద్ లోనే ఇచ్చాను. ఇక్కడ ప్రేక్షకులు సినిమాలపై చూపించే ప్రేమ ఆదరణ అద్భుతం. తెలుగు రాష్ట్రాల అబ్బాయిగా వుండాలని వుంది. నన్ను దత్తత తీసుకోవాలని కోరుతున్నాను. ఈ చిత్రంలో చాలా విలక్షణమైన పాత్ర చేశాను. నా పాత్ర చాలా ఇంటెన్స్ గా వుంటుంది. తన తండ్రి పట్ల విపరీతమైన ప్రేమ వున్న కొడుకు పాత్రలో కనిపిస్తాను. అలాగే ఈ చిత్రంలో నా భార్య గీతాంజలి పాత్రతో కూడా చాలా ఘాడమైన ప్రేమలో వుంటాను. యానిమల్స్ అన్ ప్రెడిక్టువ‌ల్ గా వుంటాయి. ఇందులో నా పాత్ర ఆ స్వభావంతో వుంటుంది. యానిమల్ కథ, పాత్రలు అందరికీ కనెక్ట్ అవుతాయి. చాలా క‌ష్ట‌ప‌డి ఈ చిత్రం చేశాం''అని అన్నారు.

సీనియ‌ర్ న‌టుడు అనిల్ కపూర్ మాట్లాడుతూ.. ''నా తొలి చిత్రం 'వంశవృక్షం' ది గ్రేట్ బాపు గారి దర్శకత్వంలో చేశాను. నా పునాది ద‌క్షిణాది పరిశ్రమలోనే పడింది. ఇక్కడే అన్నీ నేర్చుకున్నాను. ఇప్పుడు నా రెండో తెలుగు సినిమాగా యానిమల్ విడుదల కావడం ఆనందంగా వుంది. సందీప్ ఈ కథ చెప్పగానే మరో ఆలోచన లేకుండా ఒప్పుకున్నాను. ఈ కథని సందీప్ అద్భుతంగా రాసుకున్నాడు. అందరూ ఇందులో ఎమోషన్స్ కు కనెక్ట్ అవుతారు'' అని అన్నారు.

Tags:    

Similar News