యానిమల్.. ఈ రేంజ్ బుకింగ్స్ ఏంటి సామీ..

ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా హైప్ క్రియేట్ చేయడంతో భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి.

Update: 2023-12-01 03:47 GMT

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం యానిమల్. ఈ సినిమా ట్రైలర్ తోనే అంచనాలు అమాంతం పెంచేసింది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పై సందీప్ రెడ్డి ఆవిష్కరించారు. ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా హైప్ క్రియేట్ చేయడంతో భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి.

రణబీర్ కపూర్ కెరియర్ లోనే హైయెస్ట్ బుకింగ్స్ ఈ చిత్రానికి జరగడం విశేషం. పివిఆర్ ఐనాక్స్, సినీపోలీస్ మల్టీప్లెక్స్ చైన్ నుంచి ఈ సినిమాకి ఏకంగా 3 లక్షల 25 వేల అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయని తెలుస్తోంది. సింగిల్ థియేటర్స్ లో ఒక రెండు లక్షల టికెట్ల వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా అమ్ముడయ్యాయని టాక్ వినిపిస్తోంది. ఈ లెక్క చూసుకుంటే ఐదు లక్షలకి పైక్గా టికెట్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా అమ్ముడయ్యాయి.

దీంతో మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే ట్రెండ్ మిగిలిన షోలకి కూడా కొనసాగితే వంద కోట్ల గ్రాస్ ని ఈజీగా క్రాస్ చేసే ఛాన్స్ ఉంది. ఇక తెలుగు రాష్ట్రాలలో చూసుకుంటే ఒక్క హైదరాబాద్ లోనే 555 షోలకు గాను 310 షోలు హౌస్ ఫుల్ అయిపోయాయి. అడ్వాన్స్ బుకింగ్స్ అండ్ కరెంట్ బుకింగ్ కలుపుకొని ఇప్పటి వరకు హైదరాబాద్ లో 4.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.

ఈ ఏడాది ఆదిపురుష్, బ్రో సినిమాల తర్వాత అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ పరంగా యానిమల్ మూడో స్థానంలో ఉంది. సినిమాకి కూడా పాజిటివ్ టాక్ రావడంతో మిగిలిన షోలకి కూడా బుకింగ్స్ పెరిగే అవకాశం కనిపిస్తోంది. వీకెండ్ మూడు రోజులు భారీ వసూళ్లు సాధించడం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ సినిమాలకి హైదరాబాద్ లో అత్యధిక కలెక్షన్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రావడం యానిమల్ తోనే సాధ్యం అయ్యింది.

బెంగుళూరులో కూడా బుకింగ్స్ భారీగానే ఉన్నాయి. చెన్నైలో మాత్రం బెన్ ఫిట్ షోలు, ఎక్స్ ట్రా షోలు లేకపోవడం వలన అక్కడ నెమ్మదిగా నడుస్తోంది. ఓవర్సీస్ లో కూడా రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ జరిగాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే వారం రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అందుకొని రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ కొల్లగొట్టడం ఖాయం అనే మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News