రూ.5 కోట్ల కారు గిఫ్ట్... నమ్మకమా? ప్రచారం కోసమా?
చిన్న చిత్రాలుగా రూపొంది పెద్ద విజయాలను సొంతం చేసుకున్న సమయంలో నిర్మాతల నుంచి దర్శకులు ఇతర చిత్ర యూనిట్ సభ్యులకు ఖరీదైన బహుమానాలు అందడం మనం చూశాం.
చిన్న చిత్రాలుగా రూపొంది పెద్ద విజయాలను సొంతం చేసుకున్న సమయంలో నిర్మాతల నుంచి దర్శకులు ఇతర చిత్ర యూనిట్ సభ్యులకు ఖరీదైన బహుమానాలు అందడం మనం చూశాం. విజయాలను బట్టి లక్షలు, కోట్ల రూపాయలతో దర్శకులకు నిర్మాతలు కార్లు కొనివ్వడం మనం ఇప్పటి వరకు చూశాం.
పదుల సంఖ్యలో నిర్మాతలు దర్శకులకు బహుమానాలను ఇవ్వడం చూశాం. ఇప్పటి వరకు బహుమానాలు ఇచ్చిన నిర్మాతలు అందరూ కూడా తమ సినిమా విడుదల అయిన తర్వాత భారీ విజయం సాధించి భారీగా లాభాలు వచ్చిన తర్వాత మాత్రమే దర్శకులకు బహుమానాలు ఇవ్వడం జరిగింది. కానీ యానిమల్ దర్శకుడు మాత్రమే విడుదలకు ముందే అంటే ప్రీ రిలీజ్ బహుమానం ఇచ్చేశాడు.
అర్జున్ రెడ్డి మరియు కబీర్ సింగ్ సినిమా తో దర్శకుడిగా పాన్ ఇండియా రేంజ్ లో మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న దర్శకుడు సందీప్ వంగ తాజాగా రణబీర్ కపూర్ హీరోగా యానిమల్ సినిమాని రూపొందించిన విషయం తెల్సిందే. కబీర్ సింగ్ క్రేజ్ కారణంగా హిందీతో పాటు ఇతర భాషల్లో యానిమల్ భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట.
సినిమా మినిమంగా ఆడినా కూడా నిర్మాత భూషన్ కుమార్ కి భారీగా లాభాలు దక్కబోతున్నట్లుగా బాలీవుడ్ మీడియా వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. అందుకే తనకు భారీ విజయాన్ని కట్టబెట్టబోతున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగకు నిర్మాత భూషన్ కుమార్ ఏకంగా రూ.5 కోట్ల ఖరీదైన కారును బహుమానంగా ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఇప్పటి వరకు చాలా మంది నిర్మాతలు దర్శకులకు కార్లు బహుమానంగా ఇచ్చారు. కానీ ఈ బహుమానం మాత్రం అత్యంత ఖరీదైన బహుమానం అన్నట్లుగా మీడియా వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ప్రీ రిలీజ్ గిఫ్ట్ తో దర్శకుడు సందీప్ రెడ్డి చాలా సంతోషంగా ఉన్నాడు. అయితే ఇంత ఖరీదైన బహుమానం సినిమాపై నమ్మకంతో ఇచ్చాడా లేదంటే ప్రచారం కోసం ఇచ్చాడా అంటూ కొందరు నిర్మాతను ప్రశ్నిస్తున్నారు.