వైరల్‌ వీడియో : అనిల్ రాజా బలపం పట్టి డాన్స్‌

వెంకటేష్ హీరోగా నటించిన బొబ్బిలి రాజాలోని సూపర్‌ హిట్ సాంగ్ బలపం పట్టి బామ్మ ఒల్లో... అంటూ సాగే పాటకు అనిల్ రావిపూడి చేసిన డాన్స్ అదరహో అన్నట్లుగా ఉంది.

Update: 2024-05-20 05:25 GMT

దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి తనదైన వినోదాన్ని పండించడం ద్వారా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాడు. సాధారణంగా ఏదైనా ప్రీ రిలీజ్ వేడుకకి హాజరు అయిన సమయంలో, ఏదైనా ఈవెంట్‌ లో పాల్గొన్న సమయంలో అందరి దృష్టి ఆకర్షించే విధంగా ఈ దర్శకుడు మాట్లాడటం, యాక్ట్‌ చేయడం మనం చూస్తూ ఉంటాం.

గతంలో ఎన్నో సార్లు అనిల్ రావిపూడి చెప్పిన కామెడీ డైలాగ్స్ మరియు స్కిట్స్ వైరల్‌ అయ్యాయి. పలు స్టేజీల మీద చిన్న చిన్న స్టెప్స్ కూడా వేసి వైరల్‌ అయిన దర్శకుడు అనిల్‌ రావిపూడి తాజాగా జరిగిన దర్శకుల దినోత్సవ వేడుకల్లో చేసిన డాన్స్‌ సోషల్‌ మీడియాలో సెన్షేషన్ అయ్యింది.

వెంకటేష్ హీరోగా నటించిన బొబ్బిలి రాజాలోని సూపర్‌ హిట్ సాంగ్ బలపం పట్టి బామ్మ ఒల్లో... అంటూ సాగే పాటకు అనిల్ రావిపూడి చేసిన డాన్స్ అదరహో అన్నట్లుగా ఉంది. అనిల్ రావిపూడి ని నెట్టింట చాలా మంది అనిల్ రాజా డాన్స్ అదుర్స్‌ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తూ ప్రశంసిస్తున్నారు.

టాలీవుడ్‌ కు చెందిన ఎంతో మంది ప్రముఖ దర్శకులు హాజరు అయిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా స్టార్‌ హీరోలు అల్లు అర్జున్ మరియు నాని లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆ తర్వాత అనిల్ రావిపూడి వేసిన డాన్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

ప్రస్తుతం వెంకటేష్ తో కలిసి ఒక సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్న విషయం తెల్సిందే. అందుకే ఈ వేడుకలో అనిల్ రావిపూడి తన డాన్స్ కోసం వెంకటేష్ పాటను ఎంపిక చేసుకుని ఉంటాడు అనేది సోషల్‌ మీడియా టాక్‌.

మొత్తానికి దర్శకుడు అనిల్ రావిపూడి తాను మల్టీ ట్యాలెంటెడ్‌ అని నిరూపించుకున్నాడు. గతంలో కొన్ని సినిమాల్లో కనిపించిన అనిల్ రావిపూడి ముందు ముందు ఫుల్‌ లెంగ్త్‌ పాత్రల్లో కనిపిస్తే చూడాలని ఉందని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. మీకు అర్థం అవుతుందా అనిల్ సార్‌..!

Tags:    

Similar News