అనుపమ కెరీర్ మళ్లీ రివర్స్ అవుతోందా?
ఇండస్ట్రీలో మడి కట్టుకుని కూర్చుం టే పనవ్వదని భావించిన అమ్మడు తనలో సిసలైన నటిని తట్టి లేపి సంచలమైంది.
మాలీవుడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ పుల్ స్వింగ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కెరీర్ ముగిసింది అనుకుంటోన్న సమయంలో 'రౌడీ బోయ్స్' తో ఒక్కసారిగా ఫేమస్ అయింది. ఇండస్ట్రీలో మడి కట్టుకుని కూర్చుం టే పనవ్వదని భావించిన అమ్మడు తనలో సిసలైన నటిని తట్టి లేపి సంచలమైంది. అప్పటి నుంచి మాలీవుడ్ అందానికి తిరుగులేదు. గత ఏడాది 'టిల్లు స్క్వేర్' తో గ్రాండ్ సక్సెస్ అందుకుంది.
ఆ సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అయితే ఈ సక్సెస్ టాలీవుడ్ కంటే ఇతర భాషల్లోనే ఎక్కువగా అవకాశాలు తెచ్చి పెట్టినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం అమ్మడి లైనప్ చూస్తే తెలుగు కంటే మాలీవుడ్, కోలీవుడ్ లోనే ఎక్కువగా సినిమాలు చేస్తోంది. తెలుగులో 'పరదా'లో నటిస్తోంది. ఇది లేడీ ఓరియేంటెడ్ చిత్రం. ఈ సినిమా సక్సెస్ అయితే గనుక అనుపమ కెరీర్ మరో కొత్త టర్నింగ్ తీసుకుంటుంది. సోలో నాయికగా మరిన్ని అవకాశాలు అందు కోవడానికి ఛాన్స్ ఉంది.
ఇక మాలీవుడ్ లో మూడు సినిమాలు...కోలీవుడ్ లో మూడు సినిమాలు ఏక కాలంలో చేస్తూ బిజీగా ఉంది. ఇవన్నీ ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వాటి విజయాలు అనుపమ కెరీర్ని ఆయా పరిశ్రమల్లో మరింత స్ట్రాంగ్ చేసే అవకాశం ఉంది. అయితే వచ్చిన చిక్కేంటి? అంటే అమ్మడు టాలీవుడ్ లో సూపర్ హీరోయిన్ గా వెలిగిపోవాలని కలలు కంటోంది. ఇతర భాషల తరహాలో తెలుగులో మాత్రం బిజీ అవ్వడం లేదు.
రెండు..మూడు సినిమాలు చేయడం మినహా కంటున్యూగా కమిట్ అవ్వలేకపోతుంది. 2024లో 'టిల్లుస్వ్కేర్' చేసింది. అంతకు ముందు ఏడాది ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి. 'టిల్లు స్క్వేర్' తర్వాత వరుసగా తెలుగు సినిమాలకు సైన్ చేస్తుంది అనుకుంటే? అందకు భిన్నంగా ఇతర భాషల్లో బిజీ అయింది. ఎక్కడైనా నటి బిజీగా ఉంటే సంతోషించే అభిమానులెంతో మంది.