'స్పిరిట్' లో మెగా వారసుడా?
తన టెక్నికల్ టీమ్ ఇప్పటికే ఫిక్సైందని వినిపిస్తుంది. బ్యాలెన్స్ కీలక నటీనటుల ఎంపిక మాత్రం ఇంకా పూర్తవ్వలేదు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' కి జోరుగా సన్నాహాకాలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ చేసుకున్న సందీప్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. తాను రాసుకున్న పాత్రలకు ఎలాంటి నటీనటులైతే బాగుంటుంది? అన్న దానిపై సీరియస్ గా దృష్టి పెట్టి పని చేస్తున్నాడు. తన టెక్నికల్ టీమ్ ఇప్పటికే ఫిక్సైందని వినిపిస్తుంది. బ్యాలెన్స్ కీలక నటీనటుల ఎంపిక మాత్రం ఇంకా పూర్తవ్వలేదు.
ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా ఆ పనుల్లోనే బిజీ అయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ విషయం లీకైంది. ఇందులో ఓ కీలక పాత్రకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ని ఎంపిక చేసే ప్రయత్నాలు చేస్తున్నారుట. ఇప్పటికే వరుణ్ తో సందీప్ చర్చలు జరుపుతున్నాడుట. అవి ఇంకా ఓ కొలిక్కి రాలేదు గానీ వరుణ్ నుంచి కూడా పాజిటివ్ సైన్ వచ్చినట్లు వినిపిస్తోంది. ఇది 'స్పిరిట్' లో నెగిటివ్ రోల్ అని సన్నిహితుల సమాచారం.
హీరో పాత్రకు చాలా ధీటుగా ఈ రోల్ ని రాసినట్లు వినిపిస్తుంది. సందీప్ సినిమాల్లో హీరో-విలన్ పాత్రలు ఎంత బలంగా ఉంటాయి? అన్నది చెప్పాల్సిన పనిలేదు. `యానిమల్` తో అది ప్రూవ్ అయింది. 'స్పిరిట్' పక్కా రా మెటీరియల్ అని ముందే హింట్ ఇచ్చేసాడు. నాలుగైదు రకాల డ్రగ్స్ ఇచ్చిన మత్తులా ఈ సినిమా కథ ప్రేక్షకులకు అందిస్తుందని అన్నాడు.
అంటే అందులో పాత్రలు ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయి? అన్నది గెస్ చేయోచ్చు. మరి వరుణ్ ఎంట్రీ ఉంటుందా? ఉండదా? అన్నది తుది దశ చర్చలు తర్వాత కన్పమ్ అవుతుంది. కానీ ఈ ఛాన్స్ నిజమైతే వరుణ్ కి మంచి అవకా శమనే చెప్పాలి. ఒక్క సినిమాతో వరుణ్ పాన్ ఇండియాలో సంచలనమవుతాడు. తాను ఇప్పటికే సోలోగా ఓ పాన్ ఇండియా అటెంప్ట్ చేసి ఫెయిలయ్యాడు. ఫలితం తాను ఆశించిన విధంగా రాలేదు. మరి సందీప్ ఆఫర్ ని గనుక కాదనకుండా ఉంటే? తాను అనుకున్నది రీచ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.