అనిరుధ్.. ఎక్కడ చూసినా సేమ్ డిస్కషన్!
అనిరుధ్ రవిచందర్.. ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.
అనిరుధ్ రవిచందర్.. ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. వివిధ సినిమాలు.. బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంలో ఆయన వర్క్ కీలక పాత్ర పోషించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. సౌత్ సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ మ్యూజిక్ కంపోజర్స్ లో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు. జవాన్ మూవీతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి.. అక్కడి ఆడియన్స్ ను కూడా ఉర్రూతలూగించారు. మంచి ఫ్యాన్ బేస్ ను దక్కించుకున్నారు
ప్రస్తుతం సౌత్ లో అనిరుధ్ కు ఫుల్ డిమాండ్ ఉంది. అనేక సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ దేవర, కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ విడమూర్చి, సూపర్ స్టార్ రజనీకాంత్ వెట్టయాన్, కూలీ, విఘ్నేష్ శివన్ ఎల్ ఐసీ చిత్రాలకు మ్యూజిక్ అందిస్తున్నారు. మరికొన్ని చిత్రాలను లైన్ లో పెట్టేందుకు సిద్ధమమవుతున్నారు. స్టార్ హీరోల చిత్రాలకు బెస్ట్ సెలెక్షన్ గా మారిపోయారు!
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తున్న అనిరుధ్ రవిచందర్.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నారు. ఎక్కడ చూసినా ఆయన వర్క్ కోసమే మాట్లాడుకుంటున్నారు. బెస్ట్ అవుట్ పుట్ ఇస్తున్నారంటూ కొనియాడుతున్నారు. ఇప్పటికే తారక్ దేవర మూవీ నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన సాంగ్స్.. చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఫియర్ సాంగ్, చుట్టమల్లే పాటలకు అనిరుధ్ సూపర్ మ్యూజిక్ ఇచ్చారని చెబుతున్నారు.
త్వరలో ఆయుధ పూజ సాంగ్ కూడా రిలీజ్ కానుంది. అయితే రీసెంట్ గా రజనీకాంత్ వెట్టయాన్ నుంచి మనసిలాయో సాంగ్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్న ఆ పాటకు ఫాస్ట్ మాస్ బీట్ ఇచ్చారు అనిరుధ్. రజినీకాంత్ గత మూవీ జైలర్ కు అనిరుధ్ ఇచ్చిన మ్యూజిక్ బిగ్ అసెట్ గా మారింది. ఇప్పుడు వెట్టాయాన్ నుంచి వచ్చిన తొలిపాటతో అనిరుధ్.. మ్యూజిక్ లవర్స్ ను మెప్పించారు.
అనిరుధ్ రవిచందర్.. మనసిలాయో సాంగ్ కు గాత్రం కూడా అందించారు. తెలుగు, తమిళ వెర్షన్లలో ఆ పాట రిలీజ్ అవ్వగా.. రెండూ హిట్ అయ్యాయి. దేవర ట్రైలర్ కూడా ఇటీవల విడుదల అవ్వడంతో అనిరుధ్ క్రేజ్ పీక్స్ కు చేరింది. సీన్స్ కు తగ్గట్లు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు అనిరుధ్. అలా అటు దేవర సాంగ్స్, ట్రైలర్.. ఇటు వెట్టయాన్ ఫస్ట్ సింగిల్ తో అందరి దృష్టిని ఆయన ఆకర్షించారు. మరి ఫ్యూచర్ లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో వేచి చూడాలి.