అనిరుధ్ మీద మళ్లీ అదే కంప్లైంట్

ఈ సినిమాకు అనిరుధ్‌నే మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకోవాలని తారక్ అభిమానులు సోషల్ మీడియాలో ఉద్యమం చేసి మరీ కొరటాల శివను ఆ దిశగా పురిగొల్పారు.

Update: 2024-09-11 02:30 GMT

తెలుగు ప్రేక్షకులు కొన్నేళ్ల నుంచి తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ పేరు చెబితే ఊగిపోతున్నారు. తన తమిళ పాటలకు స్టెప్పులేస్తూ.. తన బ్యాగ్రౌండ్ స్కోర్‌కు గూస్ బంప్స్ తెచ్చుకుంటూ అతను మన స్టార్ హీరోల సినిమాలకు పని చేస్తే బాగుంటుందని ఆశ పడుతూ వచ్చారు. గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ‘అజ్ఞాతవాసి’కి పని చేశాడు కానీ.. అంచనాలను అందుకోలేకపోయాడు. పైగా ఆ సినిమా కూడా డిజాస్టర్ కావడంతో తనను తప్పుబట్టడానికి ఏమీ లేకపోయింది.

వర్తమానంలోకి వస్తే జూనియర్ ఎన్టీఆర్ కొత్త చిత్రం ‘దేవర’కు అతనే సంగీతం అందించాడు. ఈ సినిమాకు అనిరుధ్‌నే మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకోవాలని తారక్ అభిమానులు సోషల్ మీడియాలో ఉద్యమం చేసి మరీ కొరటాల శివను ఆ దిశగా పురిగొల్పారు. వాళ్లు కోరుకున్నట్లే అనిరుధ్ ఈ చిత్రంలోకి వచ్చాడు. కానీ అనిరుధ్ ఇప్పటిదాకా ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన మూడు పాటల విషయంలో కంప్లైంట్స్ వచ్చాయి. పాటల్లో కొత్తదనం లేదని.. తమిళంలో ఆల్రెడీ చేసిన పాటల ట్యూన్లనే ఇటు అటు తిప్పి ఇచ్చేశాడని విమర్శలు తప్పలేదు.

ఈ సినిమా మొదలైన తర్వాత తమిళంలో అతను అందించిన వేరే సినిమాల పాటలు మాత్రం అదిరిపోయాయి. గత ఏడాది ‘లియో’కు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. లేటెస్ట్‌గా ‘వేట్టయాన్’ నుంచి లాంచ్ చేసిన ‘మనసిలాయో’ పాట వెంటనే వైరల్ అయిపోయింది. ఈ పాటలో అనిరుధ్ మార్క్ స్పష్టంగా కనిపించింది. విడుదలైన ఒక్క రోజు లోపే ఈ పాట వైరల్ అయిపోయింది. సోషల్ మీడియాను ఊపేసింది. ఈ పాట విన్నాక.. అనిరుధ్ తమిళ సినిమాల మీద పెట్టే శ్రద్ధ తెలుగు చిత్రాల మీద పెట్టడనే చర్చ మరోసారి ఊపందుకుంది. అక్కడి సినిమాలకు ఎంతో కసరత్తు చేసి ప్రత్యేకమైన ట్యూన్లు అందించే అతను.. తెలుగు సినిమాలకు మాత్రం మొక్కుబడి, కాపీ ట్యూన్లు ఇస్తాడనే అభిప్రాయం ఇంకా బలపడేలా కనిపిస్తోంది.

Tags:    

Similar News