అనిరుధ్ లైనప్.. ఊచకోతే సామీ

తమిళ్ తో పాటు తెలుగు, హిందీ భాషలలో కూడా దర్శకులు అనిరుద్ కోసమే ట్రై చేస్తున్నారు.

Update: 2024-10-17 04:19 GMT

కోలీవుడ్ నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ క్రేజ్ ప్రస్తుతం టాప్ లో ఉంది. తమిళ్ తో పాటు తెలుగు, హిందీ భాషలలో కూడా దర్శకులు అనిరుద్ కోసమే ట్రై చేస్తున్నారు. అతనితో మ్యూజిక్ చేయించుకుంటే రిలీజ్ కి ముందే సినిమాకి కావాల్సినంత హైప్ వస్తుందని భావిస్తున్నారు. ఈ రెండేళ్లలో అనిరుద్ మ్యూజిక్ అందించిన సినిమాలలో ఆల్ మోస్ట్ చాలా వరకు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. అనిరుద్ కంపోజ్ చేసిన సాంగ్స్ అయితే సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టించాయి.

ఆ పాజిటివ్ వైబ్ సినిమాలకి ఎంత ప్లస్ అయ్యిందో అందరికి తెలిసిందే. ‘జైలర్’, ‘లియో’, ‘జవాన్’, ‘దేవర’ సినిమాలకి అనిరుద్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ మూవీస్ సక్సెస్ లో ఒక భాగం అయ్యాయి. ప్రస్తుతం ఇండియాలో అత్యధిక సినిమాల లైన్ అప్ కలిగి ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ ఉన్నారు. అతని సినిమాల క్రమం చూసుకుంటే ఆల్ మోస్ట్ చాలా మంది టాప్ స్టార్స్ కనిపిస్తూ ఉండటం విశేషం.

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘కూలి’ సినిమాకి అనిరుద్ వర్క్ చేస్తున్నారు. అలాగే ఎన్టీఆర్, కొరటాల ‘దేవర 2’ కి కూడా అనిరుద్ లిస్టులో ఉంది. కమల్ హాసన్, శంకర్ ‘ఇండియన్ 3’ రిలీజ్ కావాల్సి ఉంది. ఇంకా టైటిల్ పెట్టని KVN మూవీ, హిందీలో షారుఖ్ ఖాన్ ‘కింగ్’ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. అలాగే విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ మూవీ రిలీజ్ కి సిద్ధం అవుతోంది.

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెలుగులో ‘మ్యాజిక్’ అనే ఒక మూవీ చేశాడు. అందరూ కొత్తవాళ్లతో సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. మూవీ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. అలాగే నేచురల్ స్టార్ నానితో అనిరుద్ మూడో సినిమాకి వర్క్ చేయబోతున్నాడు. శ్రీకాంత్ ఓదేల దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ కన్ఫర్మ్ అయ్యారు. శివ కార్తికేయన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు.

అలాగే హెచ్ వినోత్ దర్శకత్వంలో దళపతి విజయ్ 69వ చిత్రానికి కూడా అనిరుద్ మ్యూజిక్ కంపోజ్ చేయనున్నాడు. ఇక విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి మూవీ ‘VD12’, తమిళంలో అజిత్ హీరోగా తెరకెక్కుతోన్న ‘విడామయార్చి’ కూడా అనిరుద్ లైన్ అప్ లో ఉన్నాయి. ఈ సినిమాలు అన్ని కూడా కేవలం రెండేళ్ల వ్యవధిలోనే రాబోతూ ఉండటం విశేషం.

Tags:    

Similar News