ఉదయ్ కిరణ్ హీరోయిన్.. హై గ్లామర్ డోస్
తాజాగా చీరలో మెరిశారు. సింపుల్ గ్రే కలర్ శారీకి బ్లాక్ బ్లౌజ్ పెయిర్ చేశారు. ఆక్సిడైజ్డ్ నెక్ పీస్ ధరించారు. లుక్ సింపుల్ గా ఉన్నా, ఆమె మాత్రం ఎలిగెంట్ గా ఉన్నారు.
హీరోయిన్ అనిత అంటే, తొందరగా ఎవరూ గుర్తుపట్టకపోవచ్చు. కానీ, ఉదయ్ కిరణ్ నువ్వు నేను హీరోయిన్ అనిత అంటే ఎవరైనా వెంటనే గుర్తుపడతారు. ఆమె కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ఇది. ఈ సినిమాకి తేజ దర్శకత్వం వహించారు. వీరి ముగ్గురి కెరీర్ లో మంచి వసూళ్లు రాబట్టిన సినిమా ఇది. ఈ మూవీలో పాటలు అయితే, సూపర్ హిట్ అనే చెప్పొచ్చు.
ఈ మూవీ తర్వాత అనిత తెలుగులో మరో రెండు మూడు సినిమాలు చేశారు. ఆ తర్వాత మళ్లీ కనిపించింది లేదు. అయితే, ఆ సినిమాలో నటిస్తున్నప్పుడు ఆమె కొంచెం బొద్దుగా ఉండేది. కానీ, ఎప్పుడైతే టాలీవుడ్ ని వదిలేసి బాలీవుడ్ కి చెక్కేసిందో సన్నజాజి తీగలా మారిపోయింది. అనిత లుక్ చూసి అందరూ స్టన్ అయిపోయారు. అంత అందంగా మారిపోయింది.
అంతే అందంగా ముందే ఉంటే, కచ్చితంగా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిపోయేది. అయితే బాలీవుడ్ లో ఆమె సినిమాల్లో ఛాన్సులు అందుకోలేదు. కానీ, అక్కడి బుల్లితెరపై సందడి చేసింది. చాలా సీరియల్స్ లో నటించింది. 'యేహె మొహబతేన్', 'నాగిని'వంటి సీరియల్స్ లో నటించింది. వాటిల్లోనూ హీరోయిన్ గా కాకుండా, నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ లో నటించడం గమనార్హం.
ఆ సీరియల్స్ తెలుగులోనూ డబ్ అయ్యాయి. అలా ఆమె చాలా కాలం తర్వాత తెలుగు ప్రేక్షకులకు కనిపించారు. ఇఖ, ఆమె సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా చురుకుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలు షేర్ చేసి ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా చీరలో మెరిశారు. సింపుల్ గ్రే కలర్ శారీకి బ్లాక్ బ్లౌజ్ పెయిర్ చేశారు. ఆక్సిడైజ్డ్ నెక్ పీస్ ధరించారు. లుక్ సింపుల్ గా ఉన్నా, ఆమె మాత్రం ఎలిగెంట్ గా ఉన్నారు.
ఇక, చీరలోనూ ఆమె తన క్లీవేజ్ అందాలు కనిపించేలా ఫోటోలకు ఫోజులు ఇవ్వడం విశేషం. ఇక, కొంత కాలం క్రితం ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చారు. ఆ తర్వాత కూడా అనిత మళ్లీ ఫిట్ గా మారిపోయారు. సీరియల్స్ లో వరస అవకాశాలు అందుకుంటూ సత్తా చాటుతున్నారు.