మెగా బాస్ కే గురిపెట్టిన సీతమ్మ!
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిని సైతం ఓ ఛాన్స్ ఇవ్వమని అడుగుతానని అంజలి తెలిపింది.
తెలుగు హీరోయిన్ అంజలి కెరీర్ దేదీప్య మానంగా సాగిపోతున్న సంగతి తెలిసిందే. తమిళ్ తో పాటు తెలుగు చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది. స్టార్ హీరోల సరసన సెకెండ్ లీడ్ ఉందంటే? అది సీతమ్మదే అనిపిస్తుంది. ఇప్పటికే విక్టరీ వెంకటేష్ సరసన రెండు సినిమాల్లో నటించంది. అలాగే మాస్ రాజా రవితేజ, నటసింహ బాలకృష్ణ కి జోడీగా నటించింది. ఇవన్నీ అంజలికి కెరీర్ కి దోహద పడిన చిత్రాల్లే. తనదైన ఛరిష్మాతో ప్రత్యేకమై ఇమేజ్ ని సొంతం చేసుకుంది.
ఇక `గేమ్ ఛేంజర్` సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరెకక్కుతోన్న చిత్రం లో అంజలి కీలక పాత్ర పోషిస్తుంది. మరి హీరో రామ్ చరణ్ తో సన్నివేశాలు ఉన్నాయా? లేదా? అన్నది తెలియదు గానీ శంకర్ సినిమా ఛాన్స్ అందుకుని పాన్ ఇండియాలో ఫేమస్ అవుతుంది. ఓ తెలుగు నటి శంకర్ సినిమాలో ఛాన్స్ అందుకోవడం అన్నది గొప్ప విషయమే.
ఇందుకు ఓ ప్రత్యేక కారణం కూడా ఉంది. అంజలి మార్షల్ ఆర్స్ట్ ట్రైనింగ్ కూడా తీసుకుంది. ఈ సినిమాకు ఆ విలువిద్య తెలిసిన నటి అయితే బాగుంటుందని శంకర్ ఆమెని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో అంజలి చురుకుగా పాల్గొంటుంది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిని సైతం ఓ ఛాన్స్ ఇవ్వమని అడుగుతానని అంజలి తెలిపింది. `పవన్ కళ్యాణ్ గారితో నటించాను. అల్లు అర్జున్ గారితో కలిసి పనిచేసాను.
రామ్ చరణ్ గారితో పనిచేసాను. కానీ వీళ్లందరికీ బాస్ అయిన మెగాస్టార్ చిరంజీవి గారితో మాత్రం నటించ లేకపోయాను అంది. ఆయన్ని కలిసినప్పుడు కచ్చితంగా ఓ ఛాన్స్ అడుగుతానని అంది. గేమ్ ఛేంజర్ చూసి చిరంజీవి తన పనితనాన్ని మెచ్చుకున్నట్లు పేర్కొంది. అంజలి చిరంజీవిని ఛాన్స్ అడిగితే ఆయన కాదంటారా? చిరు నటించే తదుపరి చిత్రంలోనే అవకాశం కల్పిస్తారు. పైగా తెలుగు నటి కాబట్టి నో చెప్పే అవకాశమే ఉండదు.