తెలుగమ్మాయికి ఊహించని విజయం!
టాలీవుడ్‌లో మాదిరిగానే కోలీవుడ్‌లోనూ పొంగల్ కానుకగా పలు సినిమాలు వచ్చాయి. అందులో ఒకటి విశాల్ హీరోగా నటించిన 'మదగజరాజా'. ఈ సినిమా దాదాపు 12 ఏళ్ల క్రితం పూర్తి అయ్యింది.
తెలుగు అమ్మాయి అంజలి కోలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి అక్కడ స్టార్‌డం దక్కించుకుని, పలువురు స్టార్ హీరోలతో సినిమాల్లో నటించింది. కోలీవుడ్‌లో మంచి పేరు వచ్చిన తర్వాత టాలీవుడ్‌లో అంజలి ఎంట్రీ ఇచ్చింది. తెలుగు అమ్మాయి అనే ట్యాగ్ ఉండటం వల్ల టాలీవుడ్‌లో అంజలికి ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాలేదు. వచ్చినా కొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, కొన్ని ప్రాముఖ్యత లేని సినిమా ఆఫర్లు దక్కాయి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తర్వాత అదే జోరును కొనసాగించలేక పోయింది. అయితే టాలీవుడ్‌లో క్రమం తప్పకుండా సినిమాలు మాత్రం చేస్తూనే ఉంది.
తాజాగా సంక్రాంతికి వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమాలో అంజలి కీలక పాత్రలో నటించింది. రామ్ చరణ్ పోషించిన అప్పన్న పాత్రకి జోడీగా నటించడంతో పాటు, రామ్ చరణ్ పోషించిన మరోపాత్రకు తల్లిగా నటించింది. వృద్దురాలి పాత్రలో అంజలి ఆకట్టుకుంది. అయితే సినిమా తీవ్రంగా నిరాశ పరచడంతో ఆమె కష్టం అంతా వృదా అయ్యింది. గేమ్ ఛేంజర్ సినిమాతో టాలీవుడ్‌లో మరికొన్నాళ్లు బిజీగా ఉండాలని ఆశ పడ్డ అంజలికి నిరాశ మిగిలింది. కానీ ఇదే సమయంలో ఆమె నటించిన కోలీవుడ్ మూవీ మదగజరాజా సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుని అందరినీ సర్‌ప్రైజ్ చేసింది.
టాలీవుడ్‌లో మాదిరిగానే కోలీవుడ్‌లోనూ పొంగల్ కానుకగా పలు సినిమాలు వచ్చాయి. అందులో ఒకటి విశాల్ హీరోగా నటించిన 'మదగజరాజా'. ఈ సినిమా దాదాపు 12 ఏళ్ల క్రితం పూర్తి అయ్యింది. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా విడుదల ఆగిపోయింది. ఎట్టకేలకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. విశాల్ సినిమా ప్రమోషన్‌లో చాలా బలహీనంగా కనిపించడం, ఇతరత్ర విషయాల కారణంగా అందరి దృష్టిని ఈ సినిమా ఆకట్టుకుంది. విడుదలకు ముందు మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా విడుదల తర్వాత పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
మదగజరాజా సినిమా ప్రమోషన్ సమయంలో అంజలి పెద్దగా పట్టించుకోలేదు. మరో హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ సైతం పెద్దగా ఆసక్తి చూపించలేదు. విశాల్ మాత్రమే ఈవెంట్‌కి హాజరు అయ్యి తన మద్దతు తెలిపాడు. సినిమా విడుదలై తక్కువ సమయంలోనే ఏకంగా రూ.40 కోట్ల వసూళ్లు రాబట్టింది. దాంతో సినిమాకు మరింతగా పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ నిర్వహించారు. సినిమా విడుదల తర్వాత అంజలి సైతం చిత్ర యూనిట్ సభ్యులను కలిసింది. తనవంతు ప్రమోషన్స్‌లో పాల్గొంది. మొత్తానికి ఆశ పడ్డ గేమ్ ఛేంజర్ నిరాశ పరచినా ఊహించకుండానే మదగజరాజా సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అంజలికి మంచి పేరునూ తెచ్చి పెట్టింది.