దేవర.. మరో భయంకరమైన విలన్ వచ్చేశాడు

క్యాస్టింగ్ కి ఒకప్పుడు ఉండే లిమిటేషన్స్ ఇప్పుడు లేవు. అందుకే బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ కూడా ఇతర భాషలలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

Update: 2024-07-25 07:30 GMT

సౌత్ ఇండియాలో స్టార్ హీరోలు అందరూ కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. యూనివర్సల్ గా అన్ని భాష వారికి చేరువ అయ్యే కథలకి పెద్దపీట వేస్తూ భారీ బడ్జెట్ సినిమాలని సెట్స్ పైకి తీసుకొని వెళ్తున్నారు. ఇలాంటి కథలతో తమ మార్కెట్ ని మన స్టార్ హీరోలు పెంచుకుంటున్నారు. పాన్ ఇండియా కథలని అన్ని భాషల ప్రేక్షకులకి రీచ్ చేయడం కోసం కీలక పాత్రల కోసం కూడా డిఫరెంట్ లాంగ్వేజ్ లకి చెందిన వారిని ఎంపిక చేస్తున్నారు.


క్యాస్టింగ్ కి ఒకప్పుడు ఉండే లిమిటేషన్స్ ఇప్పుడు లేవు. అందుకే బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ కూడా ఇతర భాషలలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అవకాశాల కోసం స్టార్ యాక్టర్స్ ఎక్కువ స్పేస్ క్రియేట్ చేసుకుంటున్నారు. అందుకే ఈ మధ్య ఎక్కువగా సౌత్ సినిమాలలో బాలీవుడ్ స్టార్స్ కనిపిస్తున్నారు. ఇప్పటికే సంజయ్ దత్ కేజీఎఫ్ పార్ట్ 2లో విలన్ గా నటించాడు. తెలుగులో డబుల్ ఇస్మార్ట్ మూవీలో ప్రతినాయకుడిగా కనిపిన్నాడు.

ఇమ్రాన్ హష్మీ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీలో ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. యానిమల్ సినిమాతో బాబీ డియోల్ విలన్ అవతారం ఎత్తాడు. ప్రస్తుతం సౌత్ లో సూర్య హీరోగా తెరకెక్కుతోన్న కంగువలో బాబీ డియోల్ విలన్ గా నటించాడు. బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో కూడా బాబీడియోల్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీ కోసం రాబోతున్నట్లు తెలుస్తోంది.

చిత్ర యూనిట్ బాబీ డియోల్ ని పవర్ఫుల్ రోల్ కోసం క్యాస్టింగ్ చేసినట్లు తెలుస్తోంది. దేవర మూవీని కొరటాల శివ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగంలో సైఫ్ అలీఖాన్ విలన్ గా కనిపించబోతున్నారు. దేవర పార్ట్ 1 మూవీ ఎండింగ్ తో పాటు దేవర పార్ట్ 2 మెయిన్ విలన్ గా బాబీ డియోల్ లో ప్రెజెంట్ చేయబోతున్నారంట. త్వరలో బాబీ డియోల్ నటించబోతున్నట్లు అఫీషియల్ గా చిత్ర యూనిట్ ఎనౌన్స్ చేసే అవకాశం ఉందంట.

దేవర ఫ్రాంచైజ్ లో ఇద్దరు బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ తో జూనియర్ ఎన్టీఆర్ తలపడబోతున్నాడని అర్ధమవుతోంది. సెప్టెంబర్ 27న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. జాన్వీ కపూర్ దేవర చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. ఆమెకి ఇదే మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం కావడం విశేషం.

Tags:    

Similar News