అజ్ఞాతవాసి అను… ఇప్పుడెక్కడ?

నాని ‘మజ్ను’ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మలయాళీ ముద్దుగుమ్మ అను ఇమ్మాన్యుయేల్.

Update: 2024-11-11 01:30 GMT

నాని ‘మజ్ను’ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మలయాళీ ముద్దుగుమ్మ అను ఇమ్మాన్యుయేల్. ఈ అమ్మడు మొదటి చిత్రంతోనే మంచి సక్సెస్ అందుకుంది. చైల్డ్ యాక్టర్ గా మలయాళంలో కెరియర్ స్టార్ట్ చేసిన ఈ చిన్నది 2014లో నివీన్ పోలీ హీరోగా వచ్చిన ‘యాక్షన్ హీరో బిజూ’ మూవీతో హీరోయిన్ గా మారించింది. అదే ఏడాది ‘మజ్ను’తో తెలుగులోకి అడుగుపెట్టింది. ఈ రెండు హిట్ కావడంతో అను ఇమ్మాన్యుయేల్ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది.

మొదట్లోనే తెలుగులో వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. తరువాత రాజ్ తరుణ్ కి జోడీగా ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ సినిమాలో అను నటించింది. ఈ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. మూడో సినిమానే ఏకంగా గోపీచంద్ కి జోడీగా ‘ఆక్సిజన్’ చేసింది. ఈ సినిమా కూడా ఎబౌవ్ ఏవరేజ్ గా నిలిచింది. తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘అజ్ఞాతవాసి’ సినిమాలో జతకట్టింది. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. వెంటనే ‘నా పేరు సూర్య’లో అల్లు అర్జున్ కి జోడీగా కనిపించింది.

ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. ఇలా వరుసగా స్టార్ట్ హీరోలతో జోడీ కట్టిన ఈ బ్యూటీ గ్లామర్ షో పరంగా కూడా ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా కమర్షియల్ హీరోయిన్ గా అందరిని ఆకట్టుకుంది. అయితే ఏ సినిమాలో కూడా ఆమె పెర్ఫార్మెన్స్ కి పెద్ద స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ దొరకలేదు. దానికి తోడు స్టార్ హీరోలతో చేసిన ఆమెకు లక్ ఫ్యాక్టర్ ఏ మాత్రం కలిసి రాకపోవడంతో వరుస ఫ్లాప్ లు అందుకుంది.

దీంతో అను ఇమ్మాన్యుయేల్ అవకాశాలు కూడా క్రమంగా తగ్గిపోతూ వచ్చాయి. 2022లో అల్లు శిరీష్ కి జోడీగా ‘ఊర్వశివో రాక్షసీవో’ సినిమాలో మాత్రమే అను కనిపించింది. ఇక 2023లో ‘రావణాసుర’, ‘జపాన్’ సినిమాలలో సందడి చేసింది. ఈ సినిమాలు కూడా ఆమెకి కమర్షియల్ బ్రేక్ ఇవ్వలేదు. ఈ ఏడాది ఆమె నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. వరుస ఫ్లాప్ ల కారణంగా ఆమె ఐరెన్ లెగ్ అనే ముద్ర బలంగా పడినట్లు టాక్ వినిపిస్తోంది.

ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ అందం, ఆకర్షణ ఉన్న కూడా ఇలా సినిమాలు ఫ్లాప్ కావడంతో క్రమంగా అవకాశాలు కోల్పోతారు. స్టార్ హీరోయిన్స్ అవుతారని అనుకున్నవారు కనుమరుగైపోయారు. ఇప్పుడు అను ఇమ్మాన్యుయేల్ కూడా అదే స్టేజ్ లో ఉందనే మాట వినిపిస్తోంది. అలాంటిదేం లేదని ఆమె సినిమాల పరంగా గ్యాప్ తీసుకుంటున్నారని కొందరు అంటున్నారు.

ప్రస్తుతం అను ఇమ్మాన్యుయేల్ మలయాళంలో హీరోయిన్ గా ‘యాక్షన్ హీరో బిజూ 2’లో నటిస్తోంది. హీరోయిన్ గా ఆమె చేసిన మొదటి చిత్రానికి సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా పైన అమ్మడు హోప్స్ పెట్టుకుంది. ఇది హిట్ అయితే మళ్ళీ అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు. మరి వచ్చే ఏడాది అయిన ఆమె నుంచి సినిమాలు వస్తాయా అనేది వేచి చూడాలి.

Tags:    

Similar News