ఫౌజీ ప్రభాస్ లుక్ ఇదే.. రంగంలోకి లెజెండరీ యాక్టర్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - టాలెంటెడ్ దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టుపై అంచనాలు గట్టిగానే పెరుగుతున్నాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - టాలెంటెడ్ దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టుపై అంచనాలు గట్టిగానే పెరుగుతున్నాయి. 1940ల వార్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ మూవీ, ప్రేమ, త్యాగం, దేశభక్తి అంశాలను మిక్స్ చేస్తూ ప్రేక్షకుల హృదయాలను తాకనుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ పాన్ ఇండియా రేంజ్‌లో నిర్మిస్తోంది. ఇది ప్రభాస్ కెరీర్‌లో మరో విభిన్నమైన ప్రాజెక్ట్‌గా నిలవనుంది.
సినిమాకు 'ఫౌజీ' అనే టైటిల్ అనుకుంటున్న విషయం తెలిసిందే. ఈ టైటిల్ విషయంలో అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. వాస్తవ సంఘటనలకు ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఏకకాలంలో విడుదలకానుంది. అత్యాధునిక టెక్నాలజీ, గ్రాండ్ విజువల్ ఎఫెక్ట్స్, వాస్తవిక యుద్ధ సన్నివేశాలతో ఈ మూవీని ప్రపంచ స్థాయి టెక్నీషియన్లు రూపొందిస్తున్నారు.
తాజాగా, బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ఈ ప్రాజెక్ట్‌లో అధికారికంగా జాయిన్ అయ్యారు. ప్రభాస్‌తో కలిసి స్క్రీన్‌ను పంచుకోవడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అనుపమ్ ఖేర్, ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి, సినిమాటోగ్రాఫర్ సుదీప్ చాటర్జీ కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనుపమ్ ఖేర్ పాత్ర సినిమాకి కీలకమైనది అని సమాచారం. అలాగే సినిమాలో ప్రభాస్ లుక్ ఎలా ఉంటుంది అనే విషయంలో కూడా ఈ అప్డేట్ ద్వారా క్లారిటీ వచ్చేసింది.
అనుపమ్ ఖేర్ తన సోషల్ మీడియాలో ఈ మూవీపై ఎగ్జైటింగ్ అనౌన్స్‌మెంట్ చేశారు. "ఇది నా 544వ సినిమా. ప్రభాస్ వంటి గొప్ప నటుడితో కలిసి పని చేయడం గర్వంగా ఉంది. హను రాఘవపూడి దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో, సుదీప్ చాటర్జీ సినిమాటోగ్రాఫర్‌గా ఈ ప్రాజెక్ట్ ఒక అద్భుతమైన కథతో వస్తోంది" అని ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో అనుపమ్, ప్రభాస్‌తో కలిసి దిగిన ఫోటోలను పంచుకున్నారు. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్‌లో ఉన్నాయి.
ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో సాలీడ్ హైప్ క్రియేట్ చేస్తోంది. ప్రభాస్ గ్లోబల్ స్టార్‌గా మారిన నేపథ్యంలో, ఈ సినిమా పట్ల అన్ని భాషల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. హను రాఘవపూడి ఎమోషనల్ నేరేషన్, ప్రభాస్ యాక్షన్ అవతార్, అనుపమ్ ఖేర్ లాంటి లెజెండరీ నటుల ఎంట్రీతో సినిమా పట్ల ఆసక్తి పెరిగింది. సినిమా రిలీజ్ ప్లాన్ ఇప్పటికే ఫిక్స్ చేశారు. 2026 సమ్మర్‌లో ఈ మూవీని భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ పీరియడ్ డ్రామా కచ్చితంగా ప్రభాస్ కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవకాశం ఉంది.