లక్కీ టైం కోసం వెయిట్ చేస్తున్న అమ్మడు..!

సిద్ధు జొన్నలగడ్డ ఖాతాలో ఈ సినిమా 100 కోట్లు పడేలా చేసింది కానీ అనుపమకు మాత్రం ఏమాత్రం లక్ కలిసి వచ్చేలా చేయలేదు.

Update: 2024-12-22 14:30 GMT

మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ ఈ ఇయర్ టిల్లు స్క్వేర్ తో ప్రేక్షకులను అలరించింది. సిద్ధు జొన్నలగడ్డ ఖాతాలో ఈ సినిమా 100 కోట్లు పడేలా చేసింది కానీ అనుపమకు మాత్రం ఏమాత్రం లక్ కలిసి వచ్చేలా చేయలేదు. 100 కోట్లు కొట్టాక ఏ హీరోయిన్ కి అయినా వరుస ఛాన్స్ లు వస్తాయి. కానీ అనుపమకు మాత్రం ఆ అవకాశం లేదు. తెలుగులో ఎందుకో ఆమె చేస్తున్న ప్రయత్నాలు ఏవి అంతగా వర్క్ అవుట్ కావట్లేదు. హిట్ పడ్డాక కూడా ఆఫర్లు రాకపోవడం అన్ లక్కీ అనే చెప్పొచ్చు.

ఐతే టాలీవుడ్ లో అవకాశాలు లేకపోయినా కూడా మలయాళం లో రెండు తమిళంలో రెండు సినిమాలు చేస్తుంది అమ్మడు. మలయాళంలో సినిమాలు ఆల్రెడీ షూటింగ్ పూర్తయ్యాయి. తమిళ సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. సినిమాల గ్యాప్ లో ఫోటో షూట్స్ తో కూడా అనుపమ అలరిస్తుంది. రకరకాల ఫోటో షూట్స్ తో తన ఫాలోవర్స్ ని మెప్పిస్తుంది అమ్మడు.

అనుపమకు తెలుగులో క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారు. అ ఆ నుంచి టిల్లు స్క్వేర్ వరకు అనుపమ చేసిన సినిమాలు రిజల్ట్ ఏదైనా సరే ఆమె ఫ్యాన్స్ కి మాత్రం బాగా నచ్చేశాయి. ఐతే ఈ క్రేజ్ ఆమెకు అవకాశాలు తెప్పించడం లో మాత్రం యూజ్ అవ్వట్లేదు. అనుపమ కూడా తనకు ఛాన్స్ ఇస్తే చేస్తా కానీ అవకాశాల కోసం ఎదురు చూడను అన్నట్టుగా ఉంది.

స్టార్ హీరోయిన్ అవ్వాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నా కూడా ఎందుకో అమ్మడికి కాలం కలిసి రావట్లేదు. తన దాకా వచ్చిన ప్రతి ఆఫర్ ను చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తుంది. కెరీర్ లో ఒక బంపర్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అనుపమకి అది ఏ సినిమాతో కుదురుతుందో లేదో చూడాలి. కమర్షియల్ సినిమాల కన్నా ముఖ్యంగా కంటెంట్ ఉన్న సినిమాల్లో లీడ్ రోల్ గా చేయాలని ఆసక్తిగా ఉన్న అనుపమ అన్ని రకాల సినిమాలతో అలరించాలని ఫిక్స్ అయ్యింది. టాలీవుడ్ ఎంట్రీ గ్రాండ్ గా ఇచ్చినా తర్వాత సినిమాల విషయంలో తప్పులు తడకలు వేసింది అనుపమ ఐతే అమ్మడు తిరిగి స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నా కూడా అది జరగట్లేదు. మరి అది ఏ సినిమాతో అవుతుంది అన్నది చూడాలి.

Tags:    

Similar News