అనుపమ ఫ్యాన్స్ కి చిరాకు..!
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా రూపొందిన 'లాక్ డౌన్' సినిమాను జూన్ నెలలో విడుదల చేయాల్సి ఉంది.
బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ చేతిలో ప్రస్తుతం అన్ని భాషల సినిమాలు కలిపి దాదాపు అర డజను ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. వాటి విడుదల విషయంలో కాస్త గందరగోళం నెలకొంది.
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా రూపొందిన 'లాక్ డౌన్' సినిమాను జూన్ నెలలో విడుదల చేయాల్సి ఉంది. ఆ మధ్య చిత్ర యూనిట్ సభ్యులు పోస్టర్ విడుదల చేసి మరీ జూన్ లో సినిమాను విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించడం జరిగింది. కానీ జూన్ లో లాక్ డౌన్ వచ్చే పరిస్థితి లేదు.
ఈ మధ్య కాలంలో లాక్ డౌన్ గురించి అసలు ఎలాంటి అప్‌డేట్ ఇవ్వక పోడంతో పాటు సినిమా షూటింగ్ ఇంకా చేస్తున్నారు అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సినిమా వాయిదా విషయం అయినా చిత్ర యూనిట్ సభ్యులు అఫిషియల్ గా అనౌన్స్ చేస్తే బాగుంటుంది కదా అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
టిల్లు స్క్వేర్ సినిమా తర్వాత అనుపమ పరమేశ్వరన్ కి టాలీవుడ్ లో మరింత క్రేజ్ పెరిగింది. అందుకే ఆమె సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. లాక్ డౌన్ సంగతి పక్కన పెడితే ఈ అమ్మడు టాలీవుడ్ లో మూడు సినిమాలు చేస్తోంది.
బెల్లకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందబోతున్న సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవల అందుకు సంబంధించిన చర్చలు పూర్తి అయ్యాయి అంటూ వార్తలు వస్తున్నాయి. మరో వైపు పరదా మరియు మారిచిక అనే సినిమాలను కూడా అనుపమ చేస్తున్న విషయం తెల్సిందే.
ఈ ఏడాదిలో అనుపమ నుంచి కనీసం రెండు మూడు సినిమాలు అయినా వస్తాయని ఆశించిన ఫ్యాన్స్ కి లాక్ డౌన్ మేకర్స్ వాయిదా వేసి చిరాకు తెప్పిస్తున్నారు. ఈ వారం రోజుల్లో మేకర్స్ నుంచి ఏదైనా స్పష్టమైన విడుదల తేదీ వస్తుందేమో చూడాలి.