టిల్లు స్క్వేర్.. అనుపమకు ఎంతిచ్చారు?

కళ్ళతోనే కుర్రాళ్ళని కవ్వించింది. ఈ మూవీ అనుపమకి డిఫరెంట్ ఇమేజ్ తీసుకొచ్చే ఛాన్స్ ఉందనే టాక్ ఇప్పుడు వినిపిస్తోంది.

Update: 2024-02-21 04:10 GMT

టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న అందాల భామ అనుపమ పరమేశ్వరన్. ఈ అమ్మడు కెరియర్ ఆరంభంలో కాస్త బొద్దుగా ఉండేది. అయితే ఇప్పుడు స్లిమ్ అయ్యి హాట్ గా తయారైంది. దీంతో అనుపమకి అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలు చేయడానికి కూడా అనుపమ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉండటం విశేషం.

గతంలో దిల్ రాజు బ్యానర్ లో చేసిన రౌడీ బాయ్స్ గాని, ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డతో చేస్తోన్న టిల్లు స్క్వేర్ మూవీ అనుపమ సెలక్షన్ ఛాయస్ ని రిప్రజెంట్ చేస్తున్నాయి. తాజాగా రిలీజ్ అయిన టిల్లు స్క్వేర్ మూవీలో ఇంటిమేట్, కిస్సింగ్ సన్నివేశాలతో అనుపమ బోల్డ్ పెర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేసింది. కళ్ళతోనే కుర్రాళ్ళని కవ్వించింది. ఈ మూవీ అనుపమకి డిఫరెంట్ ఇమేజ్ తీసుకొచ్చే ఛాన్స్ ఉందనే టాక్ ఇప్పుడు వినిపిస్తోంది.

మార్చిలో రిలీజ్ కానున్న ఈ చిత్రం కోసం అనుపమ ఫ్యాన్స్ క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం మల్లు బ్యూటీ ఏకంగా 2 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుందంట. సినిమాలో బోల్డ్ పెర్ఫార్మెన్స్ చేయాల్సి ఉండటంతో ఈ స్థాయిలో ఛార్జ్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. కార్తికేయ 2 సక్సెస్ తో అనుపమ రెమ్యునరేషన్ కోటికి పైగా తీసుకుంటుంది.

ఇప్పుడు టిల్లు స్క్వేర్ కి కెరియర్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుందని సమాచారం. ఈ మూవీ సక్సెస్ అయితే ఎలాగూ క్రేజ్ పెరుగుతుంది కాబట్టి రెమ్యునరేషన్ 1.5 నుంచి 2 కోట్ల మధ్యలో ఇప్పుడైతే అనుపమ డిమాండ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. రాబోయే సినిమాలకి కూడా కంటెంట్, క్యారెక్టరైజేషన్ బట్టి అనుపమ రెమ్యునరేషన్ డిమాండ్ ఉంటుందంట.

అంటే అనుపమ ఇటు డీసెంట్, క్లాస్ పెర్ఫార్మెన్స్ తో పాటు టిల్లు స్క్వేర్ సినిమాలో లాంటి బోల్డ్ క్యారెక్టర్స్ కి సిద్ధమే అని పచ్చజెండా ఊపిన రెమ్యునరేషన్ కూడా వాటికి తగ్గట్లు ఛార్జ్ చేయబోతున్నట్లు స్పష్టం అవుతోంది. టిల్లు స్క్వేర్ మీద అయితే మంచి బజ్ ఉంది. మూవీ హిట్ అయితే మాత్రం అనుపమకి అలాంటి క్యారెక్టర్స్ క్యూ కట్టే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags:    

Similar News