వైట్ అండ్ రెడ్ లో అనుష్క అంద‌మంతా!

కెమారాకి స్టైల్ గా ఫోజులిచ్చి ఆక‌ట్టుకుం టుంది. అమ్మ‌డి మ్య‌క‌ప్, హెయిర్ స్టైల్ ఇత‌ర అలంక‌ర‌ణ అంతా మ‌రింత వ‌న్నె తీసుకొచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైర‌ల్ గామారియి.

Update: 2024-09-05 06:30 GMT

అనుష్క శ‌ర్మ గ్లామ‌ర్ ట్రీట్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఫ్యాష‌న్ ఎంపిక‌ల్లో త‌ళుక్కున మెర‌వ‌డ‌మే కాదు..అవ‌స‌ర‌మైతే డిజైన‌ర్ ఎంపిక‌ల‌కే వ‌న్నే తీసుకొచ్చేలా త‌న‌దైన గ్లామ‌ర్ తోనూ ఫిదా చేస్తుంది. ఓ బిడ్డ‌కి త‌ల్లైన అనుష్క లో అందం ఇసుమొత్తు కూడా త‌రిగిపోలేద‌ని ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. తాజాగా మ‌రో సారి అనుష్క మ‌రో న్యూ ఫోటోతో నెట్టింట్టోకి వ‌చ్చేసింది. ఇదిగో ఇక్క‌డిలా రెడ్ క‌ల‌ర్ ప్యాంట్ పై వైట్ క‌ల‌ర్ ష‌ర్ట్ ధ‌రించి ఆక‌ట్టుకుంటుంది.

 

ప్యాంట్ ష‌ర్టులో అమ్మ‌డు ఎంతో అందంగా హైలైట్ అవుతుంది. కెమారాకి స్టైల్ గా ఫోజులిచ్చి ఆక‌ట్టుకుం టుంది. అమ్మ‌డి మ్య‌క‌ప్, హెయిర్ స్టైల్ ఇత‌ర అలంక‌ర‌ణ అంతా మ‌రింత వ‌న్నె తీసుకొచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైర‌ల్ గామారియి. విరుష్క అభిమానులు త‌మ‌దైన శైలిలో కామెంట్లు గుప్పిస్తున్నారు. అనుష్క శ‌ర్మ ఈ మ‌ధ్య ఇన్ స్టా యాక్టివిటీ త‌గ్గించింది.

 

స‌మ‌యం లేక నెట్టింట్లోకి రావ‌డం లేదా? ఇంకేవైనా కార‌ణాల‌తో దూరంగా ఉంటుందా? అన్న‌ది తెలియ‌దు గానీ ఈ మ‌ధ్య మాత్రం పెద్ద‌గా క‌నిపించ‌లేద‌ని నెటి జ‌నులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇక కెరీర్ మ్యాటర్ కి వస్తే.. అనుష్క‌ తదుపరి నటిగా బిజీ కానుంది. క్లీన్ స్లేట్ ప్రొడక్షన్స్ నుండి వైదొలిగి వేరొకరికి బాధ్యతలు అప్పగించి నటనలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఆమె `చక్ దే ఎక్స్ప్రెస్` షూటింగ్ లో ఉంది.

 

ఇది జులన్ గోస్వామి ప్రయాణం నుండి ప్రేరణ పొందిన కథతో రూపందుతోంది. ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. ఈ సినిమా ప్రారంభ‌మై చాలా కాల‌మైంది. అనివార్య కార‌ణాల‌తో డిలే అవుతుంది. అయితే డిసెంబ‌ర్ లో రిలీజ్ అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.

Tags:    

Similar News