అనుష్క క్రేజ్ కొవొత్తిలా కరిగిపోతుందా?
కానీ అటుపై అనుష్క కెరీర్ కొవ్వొత్తిలాగే కరిగిపోతుందన్నది తాజాగా నెటి జనుల మాటగా వినిపిస్తుంది.
టాలీవుడ్ కి తారా జువ్వలా దూసుకొచ్చింది బెంగుళూరు బ్యూటీ అనుష్క. తొలి సినిమా `సూపర్` తో యావరేజ్ సక్సెస్ అందుకుంది. అటుపై రెండు వైఫల్యాలుఎదురైనా `విక్రమార్కుడు`తో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుంది. అప్పటి నుంచి అమ్మడి కెరీర్ వెనక్కి తిరిగి చూడకుండా సాగిపోయింది. దాదాపు పదహారు.. పదిహేడేళ్ల పాటు అనుష్క పేరు మార్కెట్ లో ఓ బ్రాండ్ గామారు మ్రోగింది. `అరుంధతి`.. `భాగమతి` లాంటి లేడీ ఓరియేంటెడ్ చిత్రాలతోనూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది.
అనుష్క ఫాంలో ఉన్నంత కాలం అవకాశాలన్ని ఆమ్మడివే. ఇంకా కెరీర్ లో ఎన్నో వైవిథ్యమైన పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించింది. `బాహుబలి` లాంటి పాన్ ఇండియాని దాటి ఫేమస్ అయింది. కానీ అటుపై అనుష్క కెరీర్ కొవ్వొత్తిలాగే కరిగిపోతుందన్నది తాజాగా నెటి జనుల మాటగా వినిపిస్తుంది. మునుపటి ఛరిష్మా ఎక్కడ? అప్పటి క్రేజ్ ఎక్కడ? ఆనాటి అనుష్క ఎక్కడా? అంటూ వెతుక్కోవాల్సిన సన్నివేశం ఎదురవుతుంది. ఎందుకంటే అనుష్క తాజా పరిస్థితి అలాగే కనిపిస్తుంది.
అనుష్క కంటే ముందు..వెనుక వచ్చిన నాయికలు ఎంతో మంది ఫాంలో కనిపిస్తున్నారు. కానీ అనుష్క అవకాశాలు వచ్చినా చేయడం లేదా? రాక ఖాళీగా ఉంటుందా? ఇలా కారణం ఏదైనా అమ్మడు రేసులో వెనుకబడింది అన్నది వాస్తవంగా కనిపిస్తోంది. త్రిష..నయనతార..కాజల్ అగర్వాల్.. తమన్నా ...పూజా హెగ్డేలా అమ్మడు లైమ్ లైట్ లో లేకుండా పోతున్నట్లు కనిపిస్తోంది. వీళ్లంతా కూడా ఒకానొద దశలో బ్యాడ్ ఫేజ్ ని చూసినవారే. కానీ తమ ఐడెంటిటీని మాత్రం ఏనాడు కోల్పోలేదు. అభిమానులకు ఏదో రూపంలో టచ్ లో ఉండేవారు.
నయన్..త్రిషని మినహాయిస్తే! కాజల్..తమన్నా మాత్రం ఇన్ స్టా యాక్టివిటీతోనే చాలా కాలం పాటు తమ ఫాం ని కొనసాగించగలిగారు. ఆ రకమైన క్రేజ్ సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ తోడ్పడింది. ఇప్పుడు వాళ్లిద్దరు అవకాశాలు అందుకుని బిజీగా ఉన్నారు? యవతలో హాట్ టాపిక్ గా మారుతున్నారంటే? కారణం ఆ రకమైన చర్యలే. ఈ విషయంలో మాత్రం అనుష్క చాలా వెనుకబడి ఉంది. ఇన్ స్టా..ట్విటర్..ఫేస్ బుక్ లాంటి మాధ్యమాల్లో అనుష్క కనిపించదు. హాట్ ఫోటోల సంగతి పక్కనబెడితే.. కనీసం తనకు సంబం ధించిన ఏ అప్ డేట్ కూడా ఉండదు. ఇలా ఇన్ని రకాల కారణాలతో అనుష్క క్రేజ్ డే బై డే కొవ్వొత్తిలా కరిగిపోతున్నట్లే కనిపిస్తోంది.