రాయన్ హీరోయిన్ టాలెంట్ తెలిస్తే షాక్ అవుతారు..

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ అంటే కేవలం గ్లామర్ రోజుకి సొంతం అవ్వడం లేదు.

Update: 2024-09-20 07:30 GMT

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ అంటే కేవలం గ్లామర్ రోజుకి సొంతం అవ్వడం లేదు. విభిన్నమైన కథతో తమని తాము ప్రూవ్ చేసుకోవడానికి హీరోయిన్లు వెనకాడడం లేదు. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సృష్టించుకుని.. చీర కట్టు తోటే ఎంతో సాంప్రదాయంగా కనిపిస్తూ అభిమానులను ఫిదా చేస్తోంది ఓ హీరోయిన్. ఇప్పటివరకు ఈ బ్యూటీ నటించిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు ఆమెకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా దక్కింది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా?

ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో కుర్రకారును ఫిదా చేస్తూ దూసుకుపోతున్న ఆ బ్యూటీ మరెవరో కాదు అపర్ణ బాలమురళి. సడన్ గా ఈ పేరు చెప్తే గుర్తు రాని వారికి ధనుష్ రాయన్ మూవీ లో ‘ పంజు మిఠాయి ‘డాన్స్ చేసిన హీరోయిన్ అంటే టక్కున గుర్తుకొస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పాట తెగ వైరల్ అవుతుంది. సన్నగా ఉంటేనే హీరోయిన్స్ అన్నమాటను చెరిపేస్తూ బొదుగా ఉన్న బ్యూటిఫుల్ గా ఉంటారు అని ప్రూవ్ చేసే అపర్ణ ఈ సాంగ్లో బాగా పాపులర్ అయింది.

అందుకే ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఈ బ్యూటీ కి చాలా స్పెషల్ అట్రాక్షన్ ఏర్పడింది. కేవలం గ్లామర్ రోజుకి పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ.. అద్భుతమైన అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కోలీవుడ్ ఇండస్ట్రీలో మెల్లిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పాటు చేసుకుంటున్న ఈ ముద్దుగుమ్మ మలయాళం లో మహేష్ పగ మూవీతో ఎంట్రీ ఇచ్చింది.

కోలీవుడ్ హీరో సూర్యతో కలిసి ఆమె నటించిన సూపర్ హిట్ చిత్రం సురారై పోట్రు కు గానూ అపర్ణ ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అపర్ణకు సంబంధించిన ఓ చిన్ననాటి ఫోటో వైరల్ అయింది. అపర్ణ తండ్రి బాలమురళి సంగీత విద్యాంసుడు కావడంతో ఆమెకు నటనతో పాటు సంగీతంలో కూడా ప్రావీణ్యత ఉంది. సండే హాలిడే అనే మూవీతో ఆమె గాయనిగా కూడా పరిచయం అవ్వడం విశేషం. ప్రస్తుతం తమిళ్ తో పాటు మలయాళంలో వరుస క్రేజీ ఆఫర్స్ తో ఈ బ్యూటీ ఫుల్ బిజీగా ఉంది.

Tags:    

Similar News