ఔత్సాహికులకు ఆ రకంగా ఇండస్ట్రీ లో ఓ వేదిక!
క్యాస్టింగ్ ఏజెన్సీలు..సోషల్ మీడియాలు అందుబాటులో లేక అప్పట్లో అవకాశాల కోసం ప్రయత్నించే వారంతా ఆరకంగా ఇబ్బందులు పడేవారు. నేటి సన్నివేశం అందుకు భిన్నంగా ఉంది.
ఒకప్పుడు సినిమా ఛాన్స్ కోసం ప్రయత్నించడమంటే కాళ్లు అరిగేలా ఆఫీసులు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. తీరా వెళ్లిన తర్వాత దర్శక-నిర్మాతలు ఉంటారో? ఉండరో తెలియదు. ఒకవేళ ఉన్నా ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు? ఇవన్నీ గాక అవమనాలు తప్పేవి కాదు. సినిమా అనేది కొంత మందికే! అందరికీ కాదని హేళన చేసే బ్యాచ్ లు నేటికి ఎన్నో ఉన్నాయి. అయితే ఇప్పుడంతడి ఓపెన్ అవ్వడం లేదు.
ఏ పుట్టలో ఏపాము ఉందో? అన్నట్లు రాత్రికి రాత్రే స్టార్ అయిపోతున్నాడు. ఈ నేపథ్యంలో ఎవర్నీ తక్కువ అంచనా వేయడానికి లేదు! అన్న ఆలోచన నెగిటివ్ థింకర్స్ లోనూ కలుగుతోంది. ఇక పాత రోజుల్లో అవకాశం కోసం రకరకాల పాట్లు పడాల్సి వచ్చేంది. నిర్మాతల చుట్టూ..దర్శకుల చుట్టూ ఎక్కడకనిపిస్తే అక్కడ చేతులు కట్టుకుని నిలబడాల్సి వచ్చేది. ఇంతా చేసినా తర్వాత ఛాన్స్ ఇస్తారా? లేదో తెలియదు.
ఇండస్ట్రీ లో కాస్త అనుభవం వచ్చిన తర్వాత ఎదురయ్యే సమస్య. ఇక అప్పుడే పరిశ్రమకి వచ్చిన పరిస్థితైతే చెప్పాల్సిన పనిలేదు లేదు. సినిమా వాళ్లు కనిపిస్తే వాళ్లని వెంబడించడం..కార్లు వెనుక పరిగెత్తడం..ఇలా కొన్నిసార్లు చేస్తే ఎక్కడైనా గుర్తిస్తారేమో అన్న చిన్న ఆశ. ఇదంతా ఒకప్పటితంతు. క్యాస్టింగ్ ఏజెన్సీలు..సోషల్ మీడియాలు అందుబాటులో లేక అప్పట్లో అవకాశాల కోసం ప్రయత్నించే వారంతా ఆరకంగా ఇబ్బందులు పడేవారు. నేటి సన్నివేశం అందుకు భిన్నంగా ఉంది.
యూ ట్యూబ్ వంటి మాధ్యమాల్లో తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఉంది. అది ప్రపంచమంతా చూస్తుంది. లక్కీగా దర్శక-నిర్మాతకి నచ్చితే పిలిచి మరీ సినిమాలో పెట్టుకుంటున్నారు. వాళ్ల ద్వారా ఆ షార్ట్ ఫిలింకి పనిచేసిన వారికి అవకాశాలు దక్కుతున్నాయి. పరిచయాలు బిల్డ్ అవుతున్నాయి. అలాగే క్యాస్టింగ్ ఏజెన్సీలు ఉన్నారు. స్టార్ హంట్ పేరిట అగ్ర నిర్మాణ సంస్థలు అప్పుడప్పుడు కొత్త వారికి అవకాశాలు ఇచ్చేలా ఓ వేదక కల్పిస్తున్నారు.
అలాగే ఎవరైనా ఆఫీస్ వెళ్లి ఫోటోలిచ్చినా? కనీసం రెస్పాండ్ అవుతున్నారు. ఈ విధానం అన్ని పరిశ్రమలో ఇప్పుడు అందుబాటులో ఉంది. ఆరకంగా ఔత్సాహికులు అవకాశాల మార్గం సులభతరమైంది. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో నవీన్ పోలిశెట్టి కూడా గుర్తు చేసారు.