బాలయ్య తో ఆ సీన్ చేయడానికి అంతా భయపడ్డారు

'ఎన్టీఆర్‌' సినిమా షూటింగ్ చివరి దశలో తాను ఎంట్రీ ఇస్తాను. అసెంబ్లీ సీన్స్ లో నేను కనిపిస్తాను. జీవన్ రెడ్డి అనే రాజకీయ నాయకుడి పాత్రలో నేను నటించాను

Update: 2023-10-04 05:01 GMT

సీనియర్ నటుడు అప్పాజీ అంబరీష ఈ మధ్య కాలంలో ఎక్కువ సినిమాల్లో కనిపిస్తున్నాడు. చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ ఉన్న అప్పాజీ కొన్నాళ్ల క్రితం నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన 'ఎన్టీఆర్‌' బయోపిక్ మూవీలో నటించాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అప్పాజీ మాట్లాడుతూ 'ఎన్టీఆర్‌' సినిమా చిత్రీకరణ సమయంలో జరిగిన సంఘటన పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'ఎన్టీఆర్‌' సినిమా షూటింగ్ చివరి దశలో తాను ఎంట్రీ ఇస్తాను. అసెంబ్లీ సీన్స్ లో నేను కనిపిస్తాను. జీవన్ రెడ్డి అనే రాజకీయ నాయకుడి పాత్రలో నేను నటించాను. అసెంబ్లీ లో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక సన్నివేశం సందర్భంగా బాలకృష్ణ గారి ముందు నన్నపనేని రాజకుమారి ఇంకా కొన్ని పాత్రలు మొహాన గాజులు పగుల కొట్టి, మొహం పై ఉమ్మి వేయాల్సి ఉంది.

ఆ సన్నివేశం షూటింగ్‌ సందర్భంగా గందరగోళం నెలకొంది. బాలయ్య మొహం ముందు అలా చేయడానికి అంతా భయపడ్డారు. ఆయన మొహం మీద గాజులు పగుల కొట్టి ఉమ్మి వేసేంత ధైర్యం ఎవరు చేయలేక పోయారు. దాంతో బాలయ్య స్వయంగా పిలిచి వారితో మాట్లాడారు.

ఇది చాలా సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. దాన్ని మనం రీ క్రియేట్‌ చేస్తున్నాం. నా మొహం పై ఉమ్మి వేస్తున్నట్లుగా నటించకుండా, నిజంగానే ఉమ్మి వేస్తేనే సన్నివేశం పండుతుంది. కనుక మీరు మొహమాటం లేకుండా చెప్పినట్లు చేయండి అంటూ వారికి ధైర్యంను ఇచ్చాడు. దాంతో ఆ సన్నివేశం చక్కగా వచ్చిందని అప్పాజీ అన్నారు.

బాలయ్య గురించి కొందరు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆయన చాలా సౌమ్యులు. షూటింగ్ ముగించుకుని వెళ్తున్న ఆయన కొంత దూరం వెళ్లి తిరిగి వచ్చి నాతో వెళ్తున్నాను అని చెప్పారు. వెళ్లారు కదా అని అడగగా.. మీకు చెప్పడం మర్చి పోయాను అన్నారు. ఆయన గొప్ప నటుడు, గొప్ప వ్యక్తి అంటూ బాలయ్య గురించి అప్పాజీ అంబరీష పేర్కొన్నారు.

Tags:    

Similar News