న్యూజిలాండ్ గుట్టు విప్పేసిన కన్నప్ప!
అయితే ఇలా న్యూజిలాండ్ ని టార్గెట్ చేయడంతో కన్నప్పకి...న్యూజిలాండ్ కి ఉన్న సంబంధం ఏంటనే ఒకటే చర్చ ప్రాజెక్ట్ మొదలైన నాటి నుంచి జరుగుతూనే ఉంది.
`కన్నప్ప` షూటింగ్ ఎక్కువ భాగం న్యూజిలాండ్ లో నిర్వహించిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో నిర్మాణంలో ఎక్కడా రాజీ పడకుండా మోహన్ బాబు చిత్రాన్ని నిర్మించారు. ఆయన ఈ ప్రాజెక్ట్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని పట్టాలెక్కించారు. దేశంలో ఎన్నో అందమైన లోకేషన్లు..ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నా ప్రత్యేకంగా దాదాపు 70 నుంచి 80 శాతం షూటింగ్ న్యూజిలాండ్ లోనే చేసారు.
అయితే ఇలా న్యూజిలాండ్ ని టార్గెట్ చేయడంతో కన్నప్పకి...న్యూజిలాండ్ కి ఉన్న సంబంధం ఏంటనే ఒకటే చర్చ ప్రాజెక్ట్ మొదలైన నాటి నుంచి జరుగుతూనే ఉంది. కథకి...న్యూజిలాండ్ కి బలమైన సంబంధం ఏదైనా ఉందా? ఆ కోణంలో న్యూజిలాండ్ కి పెద్ద పీట వేసారా? అటు ఇండస్ట్రీలోనూ చర్చకొస్తుంది. షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగున్నాయి రిలీజ్ కూడా సమ్మర్ లో జరుగుతుంది.
కానీ ఇంత వరకూ న్యూజిలాండ్ గుట్టు మాత్రం విప్పలేదు. ఈ నేపథ్యంలో చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్ లో దర్శకు డు ముకేష్ కుమార్ సింగ్ ఆ సీక్రెట్ చెప్పేసారు. `కన్నప్ప` మూడవ దశాబ్ధం నాటి కథ. అప్పటి వాతావరణం , నాటి ప్రకృతి రమణీయతను మా సినిమాలో ప్రేక్షకులకు చూపించాలనే ఉద్దేశంతోనే షూటింగ్ ఎక్కువ భాగం న్యూజి లాండ్ లో చేసాం. కథకి...న్యూజిలాండ్ కి ఉన్నా సంబంధం ఏంటన్నది తెలియాలంటే? తెరపై సినిమా చూడాల్సిందే` అన్నారు.
పాన్ ఇండియాలో ఈ చిత్రం ఏప్రిల్ 25న రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ అవ్వాలి. కానీ పోస్ట్ ప్రొడక్షన్ సహా వివిధ కారణాలుగా రిలీజ్ వాయిదా పడుతుంది. అయినా ఎట్టిపరిస్థితుల్లో ఈసారి మాత్రం ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని విష్ణు, మోహన్ బాబులు కంకణం కట్టుకున్నారు. మరోవైపు మంచు ఫ్యామిలీ కుటుంబ వివాదం కొన్ని రోజులుగ ఎంత సంచలనమైందో తెలిసిందే.