సర్పకన్య నాగిని నృత్యానికి 2 కోట్ల వ్యూస్
అవును.. ఆకాశం నుంచి దిగి వచ్చిన దేవతా సుందరి ఈ మనోహరి. చూడగానే తళుక్కున వెండిమబ్బులా మెరుస్తోంది.
అవును.. ఆకాశం నుంచి దిగి వచ్చిన దేవతా సుందరి ఈ మనోహరి. చూడగానే తళుక్కున వెండిమబ్బులా మెరుస్తోంది. నీలి నింగి అంచుల్ని తాకిన ముగ్ధ మనోహరిని తలపిస్తోంది. ఇంతలోనే సర్పకన్యలా నాగిని నృత్యంతో కట్టి పడేస్తోంది. ఇంతకీ ఎవరీ సుందరి? అంటే.. కచ్ఛితంగా బాహుబలి మనోహరి నోరాఫతేహి అని చెప్పేయొచ్చు.
నోరా ఇటీవల వరుసగా సింగిల్ ఆల్బమ్స్ తో కుర్రకారును కట్టిపడేస్తోంది. ఓవైపు డ్యాన్స్ రియాలిటీ షోల జడ్జిగా కనిపిస్తూనే దక్షిణాదినా తనవైపు వచ్చే పెద్ద తెర అవకాశాల్ని అందిపుచ్చుకుంటోంది. ఇటీవల జాసన్ డెరులోతో కలిసి తన కొత్త పాట వీడియో `స్నేక్`ను విడుదల చేసింది. నోరా మంత్రముగ్ధులను చేసే ప్రదర్శన 2 కోట్ల (20 మిలియన్ల) వీక్షణలతో సంచలనం సృష్టించింది.
తాజాగా ఈ వీడియో ఆల్బమ్ కోసం ప్రత్యేక ఫోటోషూట్ నుంచి ఎంపిక చేసిన ఫోటోలను షేర్ చేయగా అవి వైరల్ గా మారుతున్నాయి. నోరా వెండి మబ్బులను తలపించే అందమైన డిజైనర్ దుస్తుల్లో మైమరిపించింది. ఈ దుస్తులను ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించారు. లాంగ్ స్కర్ట్, లేత గులాబీ రంగు బ్రాలెట్‌తో నోరా సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తోంది. నోరా ఈ పాటలో ఎప్పటిలానే బోల్డ్ మూవ్స్ తో మతులు చెడగొట్టింది. ప్రస్తుతం ఈ వీడియో, ఫోటోలు ట్రెండింగ్ గా మారుతున్నాయి.
కెరీర్ మ్యాటర్‌కి వస్తే .. నోరా నటించిన తాజా కన్నడ చిత్రం `కేడీ: ది డెవిల్` రిలీజ్ కోసం అభిమానులు వేచి చూస్తున్నారు. వరుణ్ తేజ్ `మట్కా`లో సోఫియా అనే పాత్రను నోరా పోషించిన సంగతి తెలిసిందే. నోరా తన అద్భుతమైన నటనను కనబరిచినా మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించినంతగా ఆడలేదు.