ఆ ముగ్గురు పాన్ ఇండియా కోసం సీరియస్ ప్రయత్నాల్లో!
అందుకు పర్పెక్ట్ స్టోరీ..డైరెక్టర్ ఎప్పుడు దొరుకుతాడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాంటి కాంబినేషన్ కుదిరితే కోట్ల రూపాయలు పెట్టే నిర్మాతలెంతో మంది.
పాన్ ఇండియా మార్కెట్ కోసం హీరోలంతా తపిస్తోన్న తరుణం ఇది. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ , అల్లు అర్జున్ పాన్ ఇండియాలో గ్రాండ్ విక్టరీలు నమోదు చేయడంతో మిగతా హీరోలు అలా ఫేమస్ అవ్వాలని ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. అందుకు పర్పెక్ట్ స్టోరీ..డైరెక్టర్ ఎప్పుడు దొరుకుతాడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాంటి కాంబినేషన్ కుదిరితే కోట్ల రూపాయలు పెట్టే నిర్మాతలెంతో మంది.
ఇటీవలే `అమరన్` విజయంతో కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ కి పాన్ ఇండియాలో మంచి గుర్తింపు దక్కింది. దీంతో తదుపరి రెండు చిత్రాలు కూడా పాన్ ఇండియాలో పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నాడు. మురగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇదోక యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. సినిమాపై భారీ అంచనాలున్నాయి. శ్రీ లక్ష్మి మూవీస్ ఈ చిత్రాన్ని 200 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తోంది. తమిళ్ లో తెరకెక్కుతోన్న చిత్రం అన్ని భాషల్లో రిలీజ్ చేయాలని రెడీ చేస్తున్నారు.
మరోవైపు శివ కార్తికేయన్ ల్యాండ్ మార్క్ 25వ చిత్రం అంతే ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది. ఇది కూడా బయోగ్రాఫికల్ చిత్రం. కొన్ని వాస్తవ సంఘటనలు ఆధారంగా సుధ కథ సిద్దం చేసారు. డ్వాన్ పిక్చర్స్-రెడ్ జెయింట్ మూవీస్ 250 కోట్ల బడ్జెట్ తో నిర్మించడానికి ముందుకొస్తుంది. అలాగే మలయాళంలో హీరో టివినో థామస్ `ఏఆర్ ఎమ్` చిత్రంతో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెట్టాడు. 30 కోట్ల బడ్జెట్తో నిర్మించిన సినిమా 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
ప్రస్తుతం యశ్ నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం `టాక్సిక్` లో నూ నటిస్తున్నాడు. ఈ సినిమాపై ఎలాంటి అంచనాలున్నాయి అన్నది చెప్పాల్సిన పనిలేదు. ఇలా మాలీవుడ్ తో పాటు కన్నడ, తమిళ్ లోనూ సినిమాలు చేస్తున్నాడు. యువ సామ్రాట్ నాగచైతన్య కూడా `తండేల్` సినిమాతో పాన్ ఇండియాలో ఎంట్రీ ఇస్తున్నాడు. చందు మొండేటి దర్శకత్వం వహిస్తోన్న చిత్రం కూడా వాస్తవ సంఘటనలు అధారంగా తెరకెక్కిస్తున్నారు. ఫిబ్రవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా రిలీజ్ అనంతరం చైతన్య మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రకటించే అవకాశం ఉంది. ఇంకా నవతరం హీరోలు సైతం పాన్ ఇండియా అపీల్ ఉన్న స్టోరీలతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఉవ్విళ్లూరుతున్నారు.