తమిళ హీరోలను అతిగా అంచనా వేస్తున్నారా!
తెలుగు హీరోలు డిమాండ్ చేసిన దానికంటే భారీ మొత్తంలో తమిళ హీరోలకు రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు తెలుగు నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.
టాలీవుడ్ లో ఉన్న కొందరు నిర్మాతలు తమిళ హీరోల మార్కెట్ ని అతిగా అంచనా వేస్తున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. చాలా ఏళ్లుగా అగ్ర నిర్మాతలు టాలీవుడ్ స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ ప్రాజెక్ట్స్ ని చేసేందుకు చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఇలాంటి తరుణంలో కొందరు అగ్ర హీరోలు భారీ రెమ్యూనరేషన్స్ డిమాండ్ చేయడంతో ఆ ప్రాజెక్ట్స్ ని క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే..
తెలుగు హీరోలు డిమాండ్ చేసిన దానికంటే భారీ మొత్తంలో తమిళ హీరోలకు రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు తెలుగు నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. రీసెంట్ టైమ్స్ లో 'వారిసు' మూవీ కోసం దిల్ రాజు కోలీవుడ్ స్టార్ తలపతి విజయ్ కి ఏకంగా రూ.120 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చాడు అని ప్రచారం ఉంది . సినిమా బడ్జెట్ పెరగడానికి ఈ రెమ్యునరేషన్ కూడా ప్రధాన కారణం. అందుకే మూవీ టీం సినిమా క్వాలిటీ పై కాంప్రమైజ్ అవ్వడంతో చివరికి దిల్ రాజు ఈ సినిమాతో ఎటువంటి లాభాలు పొందలేదు.
మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దిల్ రాజు ఇప్పటివరకు ఏ తెలుగు హీరోకి రూ.100 కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వలేదు. అదే తమిళ హీరో దళపతి విజయ్ కి రూ.120 కోట్లు రెమ్యునరేషన్ గా ఇచ్చాడు. ఇప్పుడు ఇదే పని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు చేయబోతున్నారు అని అంటున్నారు . వాళ్లు కోలీవుడ్ హీరో అజిత్ తో చేయబోయే సినిమాకి ఏకంగా రూ.150 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది .
క్రాక్, వీరసింహారెడ్డి వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న గోపీచంద్ మలినేని దర్శకత్వంలో అజిత్ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అజిత్ మార్కెట్ ని బట్టి చూస్తే రూ.150 కోట్ల రెమ్యూనరేషన్ అంటే అది చాలా ఎక్కువ. ఇప్పటివరకు అజిత్ సినిమాలు రూ.100 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేయలేకపోయాయి. అలాంటిది మైత్రి మూవీ మేకర్స్ అజిత్ కి రూ.150 కోట్ల రెమెంరెమ్యునరేషన్ ఇచ్చిన వార్త నిజం అయితే సినిమా బడ్జెట్ కనీసం రూ.250 నుంచి రూ.250 కోట్లకు చేరుకుంటుంది.ఓ తమిళ హీరోతో ఇంత మొత్తంలో రాబట్టాలంటే చాలా కష్టం.
అది తెలిసి కూడా మైత్రి మూవీ మేకర్స్ ఏ ధైర్యంతో అజిత్ కి రూ.150 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేశారో అర్థం కావడం లేదు. ప్రస్తుతం ఈ విషయం గురించే ఇండస్ట్రీ వర్గాల్లో డిస్కషన్ నడుస్తుంది. మైత్రి నిర్మాతలు కూడా ఇప్పటివరకు ఏ తెలుగు హీరోకి రూ.100 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చింది లేదు. కానీ తమిళ హీరోల కోసం భారీ మొత్తంలో ఇచ్చేందుకు తెలుగు నిర్మాతలు ముందుకు రావడంతో అనవసరంగా ఈ నిర్మాతలు కోలీవుడ్ హీరోల మార్కెట్ ని అతిగా అంచనా వేస్తున్నారు అంటూ పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.