టైగర్‌లో ఆ సీన్లు మరీ ఎక్కువగా ఉన్నాయా?
అంతే కాకుండా ట్రైలర్‌లో .. మగవాళ్లు ఆడవాళ్లని అనువణువూ చూస్తారని, కొలతలు బాగున్నాయ్..మగజాతి మొత్తం కొలతలే చూస్తారు..కాకపోతే అనుభూతి..ఆరాధన అని భూతులు మాట్లాడతారు..
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ `టైగర్ నాగేశ్వరరావు`. స్టూవర్ట్‌పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను రూపొందించారు. వంశీ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ మూవీలో బాలీవుడ్ భామలు నుపూర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్‌లుగా నటించారు. బందిపోటుగా రవితేజ నటించిన ఈ మూవీ దసరా సందర్భంగా అక్టోబర్ 20న పాన్ ఇండియా వైడ్‌గా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతోంది.
స్టూవర్ట్ పురంలో పుట్టి దేశ వ్యాప్తంగా తనదైన మార్కు దోపిడీలతో పాపులర్ అయిన టైగర్‌నాగేశ్వరరావు ధైర్య సాహసాలు, జానపద సంస్కృతిని, తనదైన మార్కు యాటిట్యూడ్‌ని ప్రదర్శిస్తూ పెద్దవాడిని కొట్టు, పేదవాడికి పెట్టు అనే నినాదంతో టైగర్ నాగేశ్వరరావు సాగించిన దోపిడీల నపథ్యంలో ఈ సినిమాని అత్యంత భారీ స్థాయిలో రూపొందించారు. అయితే ఇందులో టైగర్ నాగేశ్వరరావు దోపిడీలతో పాటు అతనికి మహిళలపై ఉన్న ఆకాంక్షని కూడా ఈ సినిమాలో చూపిస్తున్నారు.
సినిమాలో రవితేజ, కొంత మంది మహిళలపై చిత్రీకరించిన రొమాంటిక్ సన్నివేశాలు ఓ వర్గం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటాయనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ట్రైలర్‌లో .. మగవాళ్లు ఆడవాళ్లని అనువణువూ చూస్తారని, కొలతలు బాగున్నాయ్..మగజాతి మొత్తం కొలతలే చూస్తారు..కాకపోతే అనుభూతి..ఆరాధన అని భూతులు మాట్లాడతారు.. అంటూ రవితేజ ఇద్దరు హీరోయిన్‌లు నుపూర్ సనన్, గాయత్రి భార్గవిలతో మాట్లాడే డబుల్ మీనింగ్ డైలాగ్‌లు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
ఇందులో టైగర్‌నాగేశ్వరరావు హీరోయిజాన్ని చూపిస్తూనే మరో పక్క అతని లస్ట్ సైడ్‌ని కూడా క్లియర్‌గా చూపిస్తున్న తీరు ఓ వర్గం ప్రేక్షకుల్ని ఎట్రాక్ట్ చేయడం ఖాయం అని తెలుస్తోంది. చాలా వరకు బయోపిక్‌లలో ఇలాంటి సన్నివేశాలకు చోటిచ్చారు. కొన్నింటిలో వాటిని పక్కన పెట్టారు. కానీ టైగర్ నాగేశ్వరరావులో మాత్రం టైగర్ లస్ట్ సైడ్‌ని కూడా టచ్ చేసి చూపించడంతో ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. యాక్షన్ సన్నివేశాలని, పోలీసులని ఛాలెంజ్ చేస్తూ దోపిడీలకు టైగర్ దిగిన వైనాన్ని అంతే పర్ ఫెక్ట్‌గా చూపించిన దర్శకుడు వంశీ టైగర్ లస్ట్ యాంగిల్‌ని కూడా అంతే పర్ ఫెక్ట్‌గా ప్రజెంట్ చేసిన తీరు ఆకట్టుకోవడం ఖాయం అని చెబుతున్నారు. ఈ సీన్‌లు సినిమాకు ఎంత వరకు ప్లస్ అవుతాయో వేచి చూడాల్సిందే.