అర్జున్ రెడ్డి.. మరో మూడేళ్లలో మళ్లీ!
అర్జున్ రెడ్డి.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసిన సినిమాల్లో ఒకటన్న విషయం అందరికీ తెలిసిందే.
అర్జున్ రెడ్డి.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసిన సినిమాల్లో ఒకటన్న విషయం అందరికీ తెలిసిందే. స్టార్ హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వచ్చిన అర్జున్ రెడ్డి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. 2017 ఆగస్టు 25వ తేదీన విడుదలైన ఆ మూవీ.. రూ.50 కోట్లకుపైగా వసూలు చేసి భారీ లాభాలు అందించింది. సందీప్ వంగా డెబ్యూతో వేరే లెవెల్ క్రేజ్ సంపాదించుకున్నారు.
ఇక అప్పటి వరకు ఫ్యామిలీ హీరోగా క్లాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డి మూవీతో మాస్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. విజయ్ కెరీర్.. అర్జున్ రెడ్డి ముందు వరకు ఒకెత్తు.. ఆ తర్వాత మరో ఎత్తు అన్నట్లు సాగిందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. కెరీర్ పరంగా దేవరకొండకు మంచి బూస్టప్ ఇచ్చిన అర్జున్ రెడ్డి.. నిన్నటితో రిలీజ్ అయ్యి ఏడేళ్లు కంప్లీట్ చేసుకుంది.
ఈ సందర్భంగా అర్జున్ రెడ్డి మూవీ మేకింగ్ స్టిల్స్ ను విజయ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ సమయంలో మూవీ ఫుల్ వెర్షన్ కోసం పోస్ట్ చేశారు. అర్జున్ రెడ్డి సినిమా విడుదలై అప్పుడే ఏడేళ్లు అయ్యిందంటే నమ్మలేకపోతున్నానని తెలిపారు. గత ఏడాదే పూర్తి చేసినట్లు అనిపిస్తోందని, ఎన్నో విషయాలు ఇప్పటికీ ఇంకా గుర్తున్నాయని చెప్పారు. అర్జున్ రెడ్డి 10 ఇయర్స్ యానివర్సరీకి ఫుల్ కట్ వెర్షన్ ను రిలీజ్ చేయాలని సందీప్ రెడ్డి వంగాను రిక్వెస్ట్ చేశారు.
అయితే అప్పట్లో మూవీ రిలీజ్ అయ్యాక కూడా.. చాలా మంది ఫ్యాన్స్ ఫుల్ వెర్షన్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అప్పుడు సందీప్ రిలీజ్ చేయలేదు. కానీ ఎప్పుడో ఒకసారి రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ.. 10వ వార్షికోత్సవానికి అందుబాటులోకి తీసుకురమ్మని కోరారు. అంటే ఇంకా మూడు సంవత్సరాల వరకు వేచి ఉండాలన్నమాట. ఇక అర్జున్ రెడ్డి ఫుల్ వెర్షన్ కోసం వెయిట్ చేస్తున్నట్లు ఫ్యాన్స్ చెబుతున్నారు.
రొమాంటిక్ డ్రామా జోనర్ లో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాలో కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని యువకుడిగా విజయ్ కనిపించి మెప్పించారు. ఈ సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన షాలిని పాండే తన యాక్టింగ్ తో ఫిదా చేసింది. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై సందీప్ వంగా బ్రదర్ ప్రణయ్ వంగా నిర్మించిన అర్జున్ రెడ్డి.. అనేక కోట్ల లాభాలను అందించింది. అయితే తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ మూవీని తమిళంలో ఆదిత్య వర్మ, హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే.