వీకెండ్ విడుద‌ల‌కు 10 సినిమాలు రెడీ!

Update: 2017-11-21 17:30 GMT
నవంబ‌రు నెల‌లో ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు 15 సినిమాల వ‌ర‌కు విడుద‌ల‌య్యాయి. మొద‌టి వారంలో 3 - రెండో వారంలో 4 - మూడో వారంలో 8 సినిమాలు విడుద‌ల‌య్యాయి. వాటిలో చిన్న సినిమాలే అధికంగా ఉన్నాయి. అదే `విడుద‌ల‌`జోరు వ‌చ్చే వారం కూడా కంటిన్యూ కాబోతోంది. వాటిలో....నామ‌మాత్రంగా విడుద‌ల చేశామా?...లేదా అన్న రీతిలో రాబోతోన్న సినిమాలే అధికం. వ‌చ్చే శుక్ర‌వారం విడుద‌ల కాబోతోన్న సినిమాల్లో ఒక‌ట్రెండు సినిమాల‌పై కొద్దిగా అంచనాలున్నాయి. శ‌మంత‌క‌మ‌ణి త‌ర్వాత నారా రోహిత్ ‘బాలకృష్ణుడు’తో రాబోతున్నాడు. శ్రీ విష్ణు హీరోగా ‘పెళ్లిచూపులు’ నిర్మాత రాజ్ కందుకూరి నిర్మించిన ‘మెంటల్ మదిలో’ ను రిలీజ్ చేయబోతున్నారు. బ‌డా నిర్మాత సురేష్ బాబు అండ‌దండలు ఈ సినిమాకున్నాయి.

‘ప్రతినిధి’ రచయిత ఆనంద్ రవి హీరోగా మారి స్వీయ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ‘నెపోలియన్’ కూడా ఈ శుక్ర‌వారం త‌న లక్ ను టెస్ట్ చేసుకోబోతోంది.  ఇప్ప‌టివ‌ర‌కు ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో ఇటువంటి సినిమా రాలేద‌ని చెబుతోన్న ‘దేవిశ్రీ ప్రసాద్’ కూడా ఈ వారం విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. డ‌బ్బింగ్ కేట‌గిరీలో హైబ్రిడ్ పిల్ల సాయిప‌ల్ల‌వి నటించిన‌‘హేయ్ పిల్లగాడా’ను విడుద‌లకు రెడీ అయింది. వీటితోపాటు,‘ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారు’.. ‘బేబీ’..  ‘లచ్చి’.. ‘జంధ్యాల రాసిన ప్రేమకథ’.. ‘జూన్ 143’.. అంటూ దాదాపు ఓ 10 సినిమాలు విడుద‌ల‌కు క్యూ క‌ట్టాయి. గత వారం కూడా ఇదే త‌ర‌హాలో విడుద‌ల చేసిన చిన్న సినిమాలు నిరాశ‌ప‌రిచాయి. డ‌బ్బింగ్ సినిమాలు ఖాకీ, గృహం ఓ మోస్త‌రుగా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాయి. మెర్స‌ల్ మంచి క‌లెక్ష‌న్లు రాబ‌ట్టింది. స్ట్రెయిట్ తెలుగు సినిమాల‌లో గ‌రుడ‌వేగ మిన‌హా మ‌రే సినిమాను ప్రేక్ష‌కులు ఆద‌రించ‌లేదు. మంచు మ‌నోజ్ భారీ ఆశ‌లు పెట్టుకున్న ఒక్క‌డు మిగిలాడు  తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. సందీప్ కిష‌న్ కేరాఫ్ సూర్య ఫ‌ర‌వా లేద‌నిపించింది. మ‌రి, న‌వంబ‌ర్‌ వీకెండ్ లో వ‌చ్చే సినిమాలు ఉత్సాహ‌ప‌రుస్తాయా? ఉసూరుమ‌నిపిస్తాయా? అన్న సంగ‌తి తేలాలంటే వేచి చూడాల్సిందే!
Tags:    

Similar News